బాలీవుడ్ కండల హీరో సల్మాన్ చేసిన రేప్ వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. చలనచిత్ర ప్రముఖులు మొదలు సామాజికవేత్తలు.. మేధావులు అతగాడి నోరు జారిన వైనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త.. స్వయంగా రేప్ బాధితురాలు.. పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్ సల్మాన్ వైఖరిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సల్మాన్ పేరును సైతం ఉచ్చరించేందకు సైతం ఆమె ఇష్టపడలేదు. సల్మాన్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన ఆమె.. బహిరంగ లేఖ ఒకటి రాశారు.
‘‘నేను అతని పేరు పలకటానికి కానీ.. రాయటానికి కానీ ఇష్టపడటం లేదు. ఎందుకంటే అతడ్ని ఆ మాత్రమైనా గౌరవించటం నాకు ఇష్టం లేదు. నేను రేప్ కు గురయ్యానంటూ అతను వెకిలిగా మాట్లాడిన మాటలు అత్యాచారం పట్ల అతనికున్న తేలిక భావాన్ని సులువుగా చెప్పాడు’’ అంటూ విరుచుకుపడిన ఆమె.. ‘‘రూపం.. కొద్దిపాటి టాలెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు. సమాజంలో గుర్తింపు వస్తే బాధ్యత మరిత పెరుగుతుంది. కానీ.. అతను మాత్రం సమాజం పట్ల తన పాత్రను తేలిగ్గా తీసుకున్నాడు’’ అంటూ ఫైర్ అయ్యారు.
ఈ తరహా వ్యాఖ్యలన్నీ పర్వర్ట్ మైండ్ సెట్ ఉన్న వారే వాగుతారు. అందుకు అతను సిగ్గు పడాలన్న ఆమె.. ‘‘రేప్ ను ప్రోత్సహించకూడదని తెలిసి కూడా అతను సినిమా షూటింగ్ లోని తన అనుభవాన్ని రేప్ తో పోల్చటం దారుణమన్నారు. చిన్నతనంలోనే అత్యాచారానికి గురైన ఆమె.. తన లాంటి బాధితుల్ని ఆదుకోవటం.. వారికి కొత్త జీవితాన్ని కల్పించేందుకు.. వారిలో ధైర్యాన్ని నూరి పోసేందుకు ప్రజ్వల ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. సల్మాన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. సల్మాన్ ను వెనువెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మరి.. కండల వీరుడ్ని ఇలాంటి ఓపెన్ లెటర్స్ కదిలిస్తాయా..?