చిరాకు కావాలా? గో ఫర్ దిస్‌ మూవీ

Update: 2016-01-29 11:49 GMT
సెక్స్ కామెడీ అనే జోనర్ ఇండియాలో అంటే ఇప్పుడు కాస్త ఊపందుకుంది కానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటినుంచో ఉన్న సినిమాలే. సెక్స్ ని కామెడీని కరెక్ట్ గా మిక్సింగ్ చేసి నవ్వులు పండించడమే వీటి ఉద్దేశ్యం. కానీ మన దేశంలో సినిమాల సంగతి వేరు. ఒకటి ఏదైనా క్లిక్ అయితే దాన్నే పట్టుకు వేలాడుతూ ఉంటారు మూవీ మేకర్స్. ఇప్పుడు రిలీజ్ అయిన మస్తీజాదే సంగతి కూడా ఇంతే. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ చూడనంత సెక్సీగా చూపిస్తామన్నట్లుగా ప్రచారం చేశారు కానీ.. సినిమాలో అంత సరుకు లేదనే టాక్ వినిపిస్తోంది.

పోర్న్ మూవీస్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్.. యాక్టింగ్ పరంగా సినిమా సినిమాకి మార్పు చూపిస్తోంది. కానీ ఆమె చేస్తున్న పాత్రలు మాత్రం ఒకే మూసలో ఉంటున్నాయన్ననది వాస్తవం. ప్రతీ లైన్ ని డబుల్ మీనింగ్ గా రాసేసుకోవడం, ప్రతీ కేరక్టర్ తోనూ ద్వంద్వార్ధాలు మాట్లాడించడం... అన్ని సన్నివేశాలను ఇలాగే నింపేస్తే.. దానితోనే కామెడీ పండించాలన్న డైరెక్టర్ మిలాప్ జవేరీ ఆలోచన అంతగా క్లిక్ కాలేదనే చెప్పాలి. ఎంతసేపూ చిన్న చిన్న పీలికల్లాంటి బట్టలు వేసేసి, యాక్టర్లను చూడమంటే ఎంతవరకూ చూడగలరన్నది అసలు కాన్సెప్ట్.

సోషల్ మీడియాలో తిరిగే డబుల్ మీనింగ్ జోకులను ఒక చోటకు చేర్చేయడమే సినిమా స్క్రిప్ట్ అన్న థాట్ ఏమాత్రం ఎక్కేవిధంగా లేదు. అసలు సెక్స్ కామెడీ అంటే ఎలా తీయాలో మనోళ్లకు తెలియాలంటే.. అమెరికన్ పై సిరీస్ ను చూసి నేర్చుకోవాలని.. ప్రేక్షకులు సలహా ఇస్తున్నారంటే.. మస్తీజాదే ఏ రేంజ్ లో చిరాకు  పెట్టిందో అర్ధమవుతుంది.
Tags:    

Similar News