వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ బృందం జరిపిన చర్చలపై కూడా స్పందించారు. వరుస ట్వీట్లతో భేటీలో పాల్గొన్న ప్రముఖులను టార్గెట్ చేస్తున్న ఆర్జీవీ.. తాజాగా హీరోలందరూ జీరోలే అని.. ‘మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్’ అంటే జగన్ అని పేర్కొన్నారు.
వర్మ ట్వీట్ చేస్తూ.. ''సూపర్ మెగా బాహుబలి స్టార్స్ అందరికంటే చాలా సాధారణ ప్రజానీకానికి చెందిన వైఎస్ జగన్ గారు మరియు పేర్ని నాని గారు పెద్ద స్టార్స్ లాగా కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ నిజమైన మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ అని మహేష్ - చిరంజీవి - ప్రభాస్ మొదలైనవారు జూనియర్ ఆర్టిస్టుల వలె ఒమెగాస్టార్ చుట్టూ కూర్చొని నిరూపించారు'' అని అన్నారు.
మహేశ్ బాబు - చిరంజీవి - ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారు.. కానీ రియల్ లైఫ్ లో జగన్ ఫ్రేమ్ మధ్యలో ఉన్నారని రాంగోపాల్ వర్మ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ కు వారంతా భయపడ్డారని.. జగన్ అప్పర్ ఆఫ్ అండర్ స్టార్స్ ను బహిర్గతం చేశారని.. భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా బెగ్గింగ్ చేశారని ఎద్దేవా చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఒమేగా స్టార్ వైఎస్ జగన్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సూపర్ మెగా స్టార్స్ అందరినీ ‘హీరోలు అందరూ జీరోలు’ గా చేసారు అని ఆర్జీవీ కామెంట్స్ చేసారు.
''హీరోలందరూ భిక్షాటన గిన్నెతో వెళ్లి ఆయనను దేవుడంటూ పొగిడారు.., తద్వారా ఒమేగా స్టార్ మాత్రమే నిజమైన పవర్ ఫుల్ స్టార్ అని తమ అభిమానులకు తెలియజేసారు. దేవుడు తన భక్తులకు కోరికను మన్నించి వరాలు ఇచ్చినట్లు కొన్ని రేట్లను పెంచడానికి అతను కట్టుబడి ఉన్నారు. ఆఖరి ఆ ధరల పెరుగుదల అంతంత మాత్రమే అయినప్పటికీ, స్టార్స్ నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే వారు ఇప్పటికే అతనికి ఒమేగా స్టార్ గా పట్టాభిషేకం చేశారు'' అని రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
''ఒమేగా స్టార్ తన సొంత ఇండస్ట్రీ వాళ్ళు కూడా పవర్ లెస్ స్టార్ ని పట్టించుకోవడం లేదని, దీని ద్వారా ఒమేగా వేరియంట్ సూపర్, మెగా, బాహుబలి, సర్కార్ మిక్స్ వేరియంట్ కంటే చాలా పవర్ ఫుల్ అని నిరూపిస్తూ రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించాడు. నేను ఒమేగా స్టార్ కి మరింత పెద్ద అభిమానిని అయ్యాను ఎందుకంటే అతను చాలా సమర్ధవంతంగా పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ తానే రియల్ అని గుర్తించేలా చేసాడు. అతను తన ప్రాథమిక లక్ష్యాన్ని కోల్పోకుండా చేశాడు.. ఇప్పటి నుండి ఒమేగా స్టార్ ని ఒమేగా పవర్ స్టార్ అని పిలవాలని నేను అనుకుంటున్నాను'' అని ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్స్ చేసారు.