గుడ్డిగా నమ్మి మోసపోయాను : సురేష్ బాబు

Update: 2021-07-24 06:46 GMT
సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఎంతో మంచి పేరు దక్కించుకున్న సురేష్‌ బాబు ఇటీవల ఒక మోసగాడి చేతిలో లక్ష రూపాయలు మోస పోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆ మొత్తం చిన్నదే అయినా కూడా సురేష్ బాబు వంటి పెద్ద వ్యక్తి అంత సింపుల్‌ గా ఎలా మోసపోయాడు అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు. ఆ సమయంలో పలువురు పలు రకాలుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేశారు. వ్యాక్సినేషన్‌ వేయిస్తామంటే అంత మొత్తంలో ఎలా ఇచ్చారని కూడా కొందరు సురేష్ బాబుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఆ సమయంలో ఉన్న పరిస్థితుల కారణంగా వ్యాక్సిన్‌ తమ వారికి వేయించాలనే ఉద్దేశ్యంతో సురేష్‌ బాబు అతడిని నమ్మి లక్ష రూపాయలు కూడా చెల్లించాడు.

ఇటీవల నారప్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేను ఎవరినైనా ఈజీగా నమ్మేస్తాను. కొన్ని సందర్బాల్లో అవతలి వారు చెబుతున్న విషయాలు నిజమా కాదా అనే విషయాన్ని గుర్తించగలం. కాని పరిస్థితుల కారణంగా అవతలి వారు చెప్పేవి నిజమేనా కాదా అనే విషయాన్ని పట్టించుకోకుండా గుడ్డిగా నమ్మేస్తాము. సురేష్‌ బాబు కూడా ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించినా కూడా వ్యాక్సినేషన్‌ వద్దకు వచ్చేప్పటికి చీటింగ్ ఉంటుంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. దాంతో ఒక వ్యక్తి చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మేసి ఏకంగా లక్ష రూపాయలను చెల్లించేశాడు. వ్యాక్సినేషన్‌ కు డబ్బులు వ్యక్తిగతంగా ఎలా ఇవ్వాలనే విషయాన్ని సురేష్‌ బాబు పట్టించుకోకుండా ఇచ్చేశారు. తమ వారు అందరికి కూడా వ్యాక్సిన్ ఇప్పించాలనే ఉద్దేశ్యంతో అంత మొత్తంను ఖర్చు చేయాలనుకున్నారు తప్ప ఆయన అలా ప్రైవేట్‌ గా ఇస్తారా అనే విషయాన్ని గురించి ఆలోచించలేక పోయారట.

అతడు చేప్పిన విషయాలను నేను గుడ్డిగా నమ్మేసి మోస పోయాను అంటూ ఒప్పుకున్నాడు. నా వద్ద ఈజీగా అతడు డబ్బు తీసుకున్నాడు అంటూ సురేష్ బాబు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతడు పర్సనల్‌ అకౌంట్ కు డబ్బులు పంపించమంటూ అడిగిన సందర్బంలో అయినా కనీసం నాకు డౌట్‌ వచ్చి ఉండాలి. కాని నేను ఆ సమయంలో ఆలోచించలేక పోయాను అంటూ సురేష్‌ బాబు చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి సంఘటనలు కాకుండా ఒక గుణపాఠం గా సురేష్ బాబు భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఆమద్య ఓ యంగ్‌ దర్శకుడు కూడా అవార్డు వచ్చింది అంటే డబ్బు చెల్లించి మోస పోయాను అని గ్రహించాడు. ఎంతో మంచి పేరున్న ఇండస్ట్రీ ప్రముఖులను కొందరు మాయ మాటలు చెప్పి మోసం చేయడం చాలా కామన్‌ గానే జరుగుతుంది. చాలా మంది బయట పడరు కాని.. కొందరు మాత్రం ఇలా ఇతరులు మోసపోకూడదు అనే ఉద్దేశ్యంతో బయటకు చెప్పి అందరిని ఎడ్యుకేషన్‌ చేస్తున్నారు. సురేష్‌ బాబు ఈ విషయాన్ని పట్టించుకోకుండా బయటకు చెప్పకుండా వదిలేయ వచ్చు. కాని ఇతరులు మోస పోవద్దనే ఉద్దేశ్యంతో ఆయన మీడియా ముందుకు ఈ విషయాన్ని తీసుకు వచ్చారు.




Tags:    

Similar News