`విరాట‌ప‌ర్వం` ఓటీటీకా థియేట‌ర్ కా?

Update: 2021-12-16 23:30 GMT
రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `విరాటప‌ర్వం`. ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన కొన్నియ‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్నారు.

డి. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, బాలీవుడ్ న‌టులు నందితా దాస్‌, జ‌రీనా వాహెబ్,యంగ్ హీరో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప‌రిస్థితుల కార‌ణంగా ఉద్య‌మ బాట‌ప‌ట్టిన డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా మారిన వైనాన్ని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు.

కామ్రేడ్ భార‌త‌క్క‌గా ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి సంబంధించిన వాయిస్ ఆఫ్ ర‌వ‌న్న వీడియోని హీరో నారా పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈశ్వ‌రీ రావు, సాయి చంద్‌, నివేదా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌రణ మొత్తం పూర్త‌యింది.

నిర్మాత డి. సురేష్ బాబు రీసెంట్ స్టేట్‌మెంట్ ప్ర‌కారం కొంత భాగం చిత్రీక‌ర‌ణ మిగిలి వుంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో దాన్ని పూర్తి చేసిన త‌రువాతే సినిమా రిలీజ్ వుంటుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు కూడా.

అయితే ఈ సినిమా రిలీజ్ పై చాలా మంది సినీ ప్రియుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ అనుమానాలున్నాయి. ఊహించ‌ని విధంగా నిర్ణ‌యాలు తీసుకుని షాకిచ్చే సురేష్ బాబు ఈ సినిమా రిలీజ్ విష‌యంలోనూ అదే త‌ర‌హా షాకింగ్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల తాజా వాద‌న. సినిమా దాదాపుగా పూర్త‌యినా ఈ చిత్ర రిలీజ్ విష‌యంలో సురేష్ బాబు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌న్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

మారుతున్న ప‌రిస్థితుల‌ని అంచ‌నా వేయ‌డంలో ఇండ‌స్ట్రీలో సురేష్ బాబుని మించిన వారు లేర‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన నార‌ప్ప‌, దృశ్యం -2 చిత్రాల విష‌యంలోనూ ఇదే పంథాలో వ్య‌వ‌హ‌రించి చివ‌రి నిమిషంలో వాటిని ఓటీటీలో విడుద‌ల చేసి షాకిచ్చారు.

ఓటీటీలో విడుద‌ల చేసిన ఈ రెండు చిత్రాలు మంచి విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా సురేష్ బాబుకు మంచి లాభాల్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇదే ఫార్ములాని తాజా చిత్రం `విరాటపర్వం`కు కూడా అప్లై చేసి సురేష్ బాబు ఈ మూవీని అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

థియేట‌ర్లు ఓపెన్ అయినా ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన టికెటింగ్ విధానం కార‌ణంగా చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని `విరాటప‌ర్వం` చిత్రాన్ని కూడా సురేష్ బాబు ఓటీటీలోనే రిలీజ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని కొంత మంది వాదిస్తున్నారు. ఇంత‌కీ `విరాట పర్వం` థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుందా? లేక ఓటీటీలోనే నారప్ప‌, దృశ్యం -2 చిత్రాల త‌ర‌హాలో స్ట్రీమింగ్ కానుందా? అన్న‌ది ప్ర‌స్తుతానికైతే స‌స్పెన్స్. ఈ స‌స్పెన్స్ కి తెర‌ప‌డాలంటే సురేష్ బాబు ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వాల్సిందేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.


Tags:    

Similar News