మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో 'కంగువా' కాంబో!
దక్షిణాది టాప్ స్టార్లలో, మేటి నటుల్లో ఆయన ఒకరు. ఆయన ప్రతిభ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తెలుగులో అంతటి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తర్వాత అటు క్లాస్‌నీ ఇటు మాస్‌నీ మెప్పించగల ప్రతిభ ఉన్న నటుడు. ప్రస్తుతం 'కంగువా' అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఆ వివరాలు..
'జైభీమ్', 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను కదలించిన సూర్య.. ప్రస్తుతం 'కంగువ' అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి సినీ ప్రియులకు తెలిసిందే. పీరియడ్ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్ల వరకు ఉంటుందని అని అంచనా. బిజినెస్ అంతకు రెట్టింపు జరుగుతుందని అందరూ అంటున్నారు. దీన్ని శిరుతాయ్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఎక్కువగా తన కెరీర్లో మరో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్‌తోనే ఎక్కువ సినిమాలు చేశారు.
అయితే ఇప్పుడు శివ-సూర్య కలిసి మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వీరిద్దరు మరో కొత్త సినిమా కోసం కలిసి పనిచేయాలని సన్నాహాలు చేస్తున్నారట. 'కంగువా' సినిమా షూటింగ్ సమయంలో ఒకరి ప్రతిభ ఇంకొకరికి నచ్చి.. మరో చిత్రాన్ని కూడా రూపొందించాలని నిర్ణయించుకున్నారట.
మరో స్ట్రాంగ్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని కూడా కంగువాను నిర్మిస్తున్న స్టూడియో గ్రీనే రూపొందించనుందని తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికార ప్రకటన కూడా వస్తుందట. చూడాలి మారి ఏం జరుగుతుందో..
ఇక కంగువా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సూర్య ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు యూవీ క్రియేషన్స్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 3డీ ఫార్మాట్లోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. 2024లో పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.