సూర్య-జ్యోతిక.. చూడముచ్చటైన జంట. సెలబ్రెటీల్లో ఉండే బడాయి.. హంగు ఆర్భాటాలు వీళ్లిద్దరిలో ఎంత మాత్రం కనిపించవు. వీళ్లిద్దరినీ విడివిడిగానే కాకుండా జంటగానూ ఎంతో అభిమానిస్తారు ప్రేక్షకులు. స్వతహాగా ముంబయి అమ్మాయి అయినప్పటికీ సూర్యను పెళ్లి చేసుకుని అతడి కుటుంబంలో ఒదిగిపోయిన తీరుకు జ్యోతికకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇద్దరూ ఎక్కడ జంటగా కనిపించినా చాలా ఒద్దికగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. పెళ్లి తర్వాత కొన్నేళ్ల పాటు జ్యోతిక సినిమాలకు దూరమైనప్పటికీ.. తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలంటే అడ్డు చెప్పలేదు సూర్య.
స్వయంగా సొంత బేనర్లో ‘36 వయదినిలే’ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. దీని తర్వాత జ్యోతిక ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కనుంది. ‘కుట్రమ్ కడిత్తాల్’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న బ్రహ్మ అనే దర్శకుడు జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం జ్యోతిక ఫెరోషియస్ క్యారెక్టర్ చేయబోతోంది. సినిమాలో ఈ పాత్ర బుల్లెట్ నడపాలి. అందుకోసం జ్యోతికకు స్వయంగా సూర్యానే బుల్లెట్ నేర్పించడం విశేషం. ఏ సెక్యూరిటీ లేకుండా సూర్య.. జ్యోతిక కలిసి బుల్లెట్ తీసుకుని చెన్నైలోని విశాలమైన ఓ రోడ్డులోకి వచ్చారు. అక్కడ సూర్యనే దగ్గరుండి జ్యోతికకు బుల్లెట్ నడపడం నేర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.