సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి వర్ధంతికి ముందు సహనటుడు ప్రతీక్ బబ్బర్ `చిచోర్` సెట్ లో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకున్నారు. అతను సుశాంత్ గొప్పతనం గురించి చెప్పారు. అందరినీ కలుపుకునే వ్యక్తి.. కానీ అప్పుడప్పుడు తన సొంత ప్రపంచంలోకి వెళతాడని అన్నారు.
బాలీవుడ్ నటులలో అసాధారణమైన నటులలో సుశాంత్ ఒకరు. అతడు ఎంతో ఎదిగే లక్షణాలు కలిగి ఉన్న స్టార్ అని ప్రశంసించారు.14 జూన్ 2020న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతని మరణాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిశీలిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులో ఆర్థిక విషయాలు సహా మాదకద్రవ్యాల సంబంధిత కోణాన్ని పరిశీలిస్తున్నాయి.
సుశాంత్ నేను పరిచయస్తులం. కలిసి ఈవెంట్లకు వెళుతుంటాం. నేను అతన్ని రెండుసార్లు జిమ్ లో కూడా చూశాను. సుశాంత్ కి ఎంతో బ్రైట్ నెస్ ఉందని నేను గమనించాను. అది వ్యాపారంలోనే కాదు.. అన్నిటా అతను ప్రత్యేకమైనవాడు. నిలదొక్కుకున్న నటుడు`` అని ప్రతీక్ ఒక ప్రముఖ దినపత్రికతో అన్నారు.
చాలా కలుపుకోలుగా సరదాగా ప్రేమించేవాడిగా నాకు తెలుసు. మాట్లాడటానికి సులభమైన వ్యక్తి. కానీ అతను కొన్నిసార్లు తన సొంత ప్రపంచంలోకి కూడా వెళ్లిపోతాడు. సెట్లో అందరితో సరదాగా గడుపుతాడు. క్వాంటం ఫిజిక్స్- గ్రహాలు- నక్షత్రాలు - శాస్త్రాల గురించి మాట్లాటాన్ని సుశాంత్ ఇష్టపడతాడు. ఈ చిత్రం షూటింగ్ తర్వాత అతను అంటార్కిటికాను సందర్శించాలని అనుకున్నాడు. అంత దూరతీరానికి.. ఎవరు నిజంగా అలా చేయాలని ఆలోచిస్తారు? అతను అన్నదే చేసాడు! అతను జీవితం గురించి ఆసక్తిగా ఉన్నవాడు. దానిని అన్ని మార్గాల నుంచి అన్వేషించాడు. అతను ప్రతిదానిని భిన్నంగా చూస్తాడు. అతడు ఒక రత్నం.. అని ప్రశంసించారు.