బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కారణం అంటూ ఆయన అభిమానులు మరియు కొందరు సినీ వర్గాల వారు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్ మరియు మహేష్ భట్ లపై ఈ కేసు విషయమై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. పోలీసులు వీరిద్దరిని కాకుండా వేరే వారిని ప్రశ్నిస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఎట్టకేలకు ముంబయి పోలీసులు మహేష్ భట్ నుండి వాంగ్మూలంను స్వీకరించారు.
పోలీసుల విచారణలో మహేష్ భట్ మాట్లాడుతూ సుశాంత్ అభిమానులు చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. సుశాంత్ ను తాను కేవలం రెండు సార్లు మాత్రమే కలిశాను. 2018 నవంబర్ లో మొదటి సారి ఆ తర్వాత 2019 జనవరిలో. ఆ తర్వాత అతడితో కాంటాక్ట్ లో లేను. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి 2018లో నా సినిమాలో నటించింది. ఆ సమయంలో సుశాంత్ ను నాకు పరిచయం చేసింది. సుశాంత్ నా సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్లుగా ఆమె ద్వారా తెలిసింది.
సడక్ 2 చిత్రంలో మొదట సుశాంత్ ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి కదా ఆ విషయంపై మీ స్పందన ఏంటీ అంటూ మహేష్ భట్ ను ప్రశ్నించగా.. అసలు ఆ సినిమా కోసం సుశాంత్ పేరును కనీసం పరిశీలించలేదు. మొదటి నుండి ఆదిత్యరాయ్ కపూర్ నే ఆ సినిమాకు అనుకున్నాం. నన్ను కలిసిన సమయంలో సుశాంత్ ఒక చిన్న పాత్ర అయినా మీ సినిమాలో ఇవ్వండి అంటూ కోరాడని మహేష్ అన్నాడు. ఈ కేసు విషయంలో ముందు ముందు కూడా ఏదైనా అవసరం అయితే తప్పకుండా సహకరిస్తానంటూ పోలీసులకు హామీ ఇచ్చి తన వాంగ్మూలంను ముగించాడట.