తెలుగు హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్??

Update: 2016-07-29 08:05 GMT
చాలామంది హీరోయిన్లు ఎన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటారు. క్రేజ్ ఉన్నంతవరకూ సినిమాలు చేస్తూనే ఉంటారు. పెళ్లైపోయినా హీరోయిన్లుగా కంటిన్యూ అయ్యే ట్రెండ్ బాలీవుడ్ లో ఉంది కానీ మన దగ్గర మాత్రం లేదు. అందుకే పెళ్లి - నిశ్చితార్ధం లాంటి వాటిని బయటకు పొక్కకుండా చూసుకుంటారు.

హీరోయిన్ సుష్మా రాజ్ కు నిశ్చితార్ధం అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. కన్నడలో స్టార్ట్ చేసి.. తెలుగులో నీలకంఠ మాయతో అరంగేట్రం చేసింది సుష్మా రాజ్. జోరులో సందీప్ కిషన్ తో కలిసి ఆడి పాడింది. ఆ తర్వాత తమిళ్ లో అదృష్టం పరీక్షించుకుంది. రీసెంట్ గా త్రిష నాయకిలో కూడా మంచి పాత్రలోనే మెరిసిన ఈ భామ.. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న ఈడు గోల్డ్ ఎహె లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండో ఓ తమిళ్ మూవీ కూడా చేతిలో ఉంది.

అన్నీ కలిపి అరడజన్ సినిమాలు చేసిన సుష్మారాజ్ కి.. తన ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. మే నెలలోనే ఎంగేజ్మెంట్ అయిపోగా.. ఈ విషయాన్ని సైలెంట్ గా ఉంచారట. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయి, రిలీజ్ అయ్యాక మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందో సుష్మా స్వయంగా చెప్పాల్సిందే.
Tags:    

Similar News