ఈమద్య కాలంలో సినిమాలు లేవు కనుక విడుదల అవుతున్న వెబ్ సిరీస్ లకు మరియు వెబ్ సినిమాలకు మంచి ఆధరణ దక్కతుంది. ఎక్కువ మంది ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో వెబ్ సిరీస్ లకు కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. ఆహాలో ఇతర ఓటీటీలో విడుదల అవుతున్న వెబ్ సిరీస్ లను ఈమద్య తెగ ప్రమోట్ చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కాని మెగా డాటర్ సుష్మిత కొనిదెల నిర్మించిన షూట్ ఔట్ వెబ్ సిరీస్ గురించి మాత్రం అస్సలు ప్రచారం లేదు. వచ్చే వారం రిలీజ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ సైలెంట్ గా ఉంది.
ఈ వెబ్ సిరీస్ తో మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా పరిచయం అవ్వబోతుంది. మెగా ఫ్యామిలీ హీరోస్ ను దించి ప్రచారం చేయించవచ్చు. కాని సుష్మిత మాత్రం పెద్దగా ప్రచారం విషయంలో శ్రద్ద పెట్టడం లేదు. కనీసం ఆమె కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి తన వెబ్ సిరీస్ గురించి వివరాలు వెళ్లడించింది లేదు. ఆనంద్ రంగా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్.. శ్రీకాంత్.. నందిని రాయ్ లతో పాటు ప్రముఖ నటీనటులు నటించారు. చివరి వారంలో అయినా షూట్ ఔట్ ప్రమోషన్స్ చేస్తారా లేదంటే కంటెంట్ పై నమ్మకంతో అలాగే వదిలేస్తారా అనేది చూడాలి. ఈనెల 25న జీ5 ఓటీటీ ద్వారా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వబోతుంది.