మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడిందంటూ ప్రచారం సాగుతోంది. అక్టోబర్ లో రాదు.. సంక్రాంతికే! అంటూ ఓ పుకార్ షికార్ చేస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలీదు కానీ.. ప్రస్తుతం సైరా టీమ్ పడుతున్న శ్రమ చూస్తుంటే ఔరా! అనకుండా ఉండలేం.
`సైరా` చిత్రాన్ని డెడ్ లైన్ ప్రకారం రిలీజ్ చేసేందుకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రకారమే రేయింబవళ్లు శ్రమిస్తున్నారట. ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ వర్క్ అనేది చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నది కాబట్టి అందుకు ఎంతో అడ్వాన్స్ ప్లాన్ ని డిజైన్ చేశారు. ఇందుకోసం ఆల్మోస్ట్ బాహుబలి వర్కింగ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. ఒకేసారి మొత్తం ప్రపంచ దేశాల్లోని 26 స్టూడియోల్లో వీఎఫ్ ఎక్స్ సహా కీలకమైన పనులన్నీ జరుగుతున్నాయి. ఇండియా- రష్యా-ఇరాన్- అమెరికా- ఈజిప్ట్ వంటి చోట్ల వీఎఫ్ ఎక్స్ స్టూడియోల్లో వర్క్ జరుగుతోంది. క్వాలిటీ వర్క్ కోసం నిర్మాత చరణ్ ఏమాత్రం రాజీకి రాకుండా పని చేయిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం చరణ్ ఫ్రీక్వెంట్ గా స్టూడియోల్ని విజిట్ చేస్తున్నారట.
సైరా చిత్రాన్ని నాన్నకు అమ్మ సురేఖ గారు ఇస్తున్న కానుక అని రామ్ చరణ్ ఆరంభమే ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని ఎంతో సెంటిమెంటుగా భావించి నాణ్యత పరంగా రాజీకి రాకుండా నిరంతరం శ్రమిస్తున్నారట. ఈ సినిమా కోసమే ఆర్.ఆర్.ఆర్ కి చిన్నపాటి బ్రేక్ ఇచ్చారని ఇటీవల ప్రచారమైంది. డెడ్ లైన్ పెట్టుకుంటే కొణిదెల కంపెనీ అధినేత అంత తేలిగ్గా విడిచిపెట్టే రకం కాదన్న ముచ్చటా మెగాభిమానుల్లో వినిపిస్తోంది.