గ్లామర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అందరి మాదిరి స్కిన్ షో తో ఛాన్స్ లు కొట్టేస్తుందన్న మాట అనిపించుకుంది. ఒక దశలో అవకాశాలు పుష్కలంగా ఉన్న దశ నుంచి ఛాన్స్ ల కోసం విపరీతంగా ప్రయత్నించాల్సిన వేళలో.. టాలీవుడ్ ను వెళ్లిపోయింది. కట్ చేస్తే.. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాతో ఒక్కసారి అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. ఆమెలో ఇంత మంచి నటి ఉందా? అనిపించేలా చేసింది తాప్సీ.
హిందీలో ఆమె నటించిన పింక్ మూవీతో తాప్సీని ఆర్టిస్ట్ గా గౌరవించే అభిమానుల సంఖ్య చాలానే పెరిగింది. మిగిలిన చాలామంది మాదిరి ఆమె స్కిన్ షోకు మాత్రమే పరిమితం కాదని.. అంతకు మించిన నటి ఆమెలోఉందన్న విషయం స్పష్టమైంది. ఇలాంటి కోణాన్ని టాలీవుడ్ అస్సలు చూడలేదే అన్న మండిపాటు పలువురు నోట వచ్చింది కూడా. అవకాశాలు తగ్గిన హీరోయిన్ కు ఎన్ని కష్టాలు ఎదురవుతాయి? ఎన్ని మాటలు పడాల్సి ఉంటుందనటానికి తాప్సీ బెస్ట్ ఎగ్జాంఫుల్.
తనకేమాత్రం సంబంధ లేకున్న.. ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అయితే.. ఆ డెబిట్ మొత్తాన్నితాప్సీ ఖాతాలోకి వేసేసి.. ఐరెన్ లెగ్ అన్న బిరుదు ఇచ్చేశారు.ఈ మాట అనిపించుకోవటం చాలా బాధనిపించిందని వాపోయింది. ప్లాప్ అయిన ఆ సినిమాలు స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చినవే. హీరో.. డైరెక్టర్లను వదిలేసి.. దురదృష్టాన్ని తన ఖతాలో వేసిన వైనం ఆమెను తీవ్రంగా కలిచివేసింది
తన సహనాన్ని ఎంతలా పరీక్షించారో ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చింది. ‘‘పారితోషికం తగ్గించుకోమని కొందరు నిర్మాతలు చెప్పారు. నా నిర్ణయం చెప్పే లోపలే.. ప్రాజెక్టు నుంచి తప్పించేవారు. కొందరు నిర్మాతలు తమ ఆర్థిక ఇబ్బందుల్ని నా దురదృష్టం ఖాతాలో వేసేవారు. ఇలాంటి వాటికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బాలీవుడ్ కు వెళ్లిన కొత్తల్లో నేను టాప్ హీరోయిన్ ను కాదని కొందరు టాప్ హీరోలు నాతో యాక్ట్ చేయటానికి ఇష్టపడే వారు కాదు. అదో బాధ అయితే.. నా డేట్స్ తీసుకొని.. మరో పెద్ద హీరోయిన డేట్స్ దొరికాయంటూ నన్ను తప్పించేవారు. చివరకు నాకు రావాల్సిన పారితోషికం అమాంతం తగ్గిపోయింది. బేసిక్ పే కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరుకుందని చెబితే నమ్మరేమో కానీ..నిజం. కానీ.. నేనెవరినీ తప్పు పట్టను. కొంతమంది నా బాడీ షేప్ బాగుండదని అనే వారు. ఇలాంటి వాటికి బాధ పడను. నటనంటే ఇష్టం. నా ప్రతిభ మీద ఉన్న నమ్మకంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చా.. ఇదే తీరులో బలంగా బతకాలనుకుంటున్నా’’అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.విషయాల్ని ఇంత ఓపెన్ గా.. దైర్యంగా మాట్లాడే తాప్సీకి ఆల్ ద బెస్ట్ చెబుదాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/