వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ వివాదాల్లో చిచ్చుకుంటోంది. ఈ మధ్య ఆమె నోటి దరుసుతో వివాదాలు కొనితెచ్చుకుంటోంది. ప్రతీసారి ఏదో ఒక అంశంపై నోరుజారడం చిక్కుల్లో పడడం జరుగుతోంది. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో దేశమంతటా వ్యతిరేకత పెరిగిపోతుంది. ఆమె బీజేపీ ఏజెంటని కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి అసలు పద్మశ్రీ ఇవ్వడమేంటని కేంద్రప్రభుత్వాన్ని తిడుతున్నారు.
ఇదిలా ఉంటే కంగనా గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదని అది కేవలం భిక్ష అని నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వాంతంత్య్రం కోసం పోరాడిన ఎంతోమంది త్యాగాలను ఆమె అవమానించిందని దేశంలో పలు చోట్ల నిరసనలు చేశారు.అప్పటి నుంచే ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని సైతం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది.
తాజాగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ (డీఎస్.జీ.ఎంసీ) ఈ అంశంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ముఖ్యంగా సిక్కులను లక్ష్యంగా చేసుకొని కంగనా రనౌత్ వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొంది.
అలాగే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతలను అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదు చేసింది. వెంటనే ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. విద్వేషపూరితమైన మాటలతో దేశ ప్రజలను రెచ్చగొట్టేలా కంగన రనౌత్ వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.