నా ఇంటి పేరు సిల్కు.. నా ఒంటి పేరు మిల్కూ అంటూ ఆ మధ్య ఓ ఊపు ఊపేసింది తమన్నా. ‘అల్లుడు శీను’లోని ఆ పాట కోసం ఆమెకు 70-80 లక్షల దాకా చదివించుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ పాటకు వేసిన సెట్టింగుకి కూడా బాగానే ఖర్చయినట్లు చెప్పుకున్నారు. తాజాగా తమ్మూ మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసింది. బ్యాచిలర్ బాబూ.. అంటూ సాగే ఈ పాట ఇప్పటికే సెన్సేషన్ అవుతోంది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఆ పాటే హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇంకే హీరోలతోనూ ఐటెం సాంగ్ చేయని.. బెల్లంకొండ బాబు పక్కన మాత్రం ఇలాంటి పాటలు చేస్తూ అందాలు ఆరబోస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే తమన్నా ఇలా చేయడానికి ఆమెకిస్తున్న భారీ పారితోషకమే కారణమని అంటున్నారు. ‘బ్యాచిలర్ బాబూ’ పాటకు కూడా తమ్మూ బాగానే పుచ్చుకుందట. ఈ ఫిగర్ ఎంతన్నది కరెక్టుగా తెలియడం లేదు కానీ.. ఆమె రెమ్యూనరేషన్, పాట చిత్రీకరణకు కలిపి రూ.2 కోట్లు అయ్యిందట. ఇది పుకారు కూడా కాదు.. స్వయంగా దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాసరావే వెల్లడించిన వాస్తవం. ఈ పాట కోసం భారీ సెట్టింగ్ అదీ వేసి చాలా హంగామానే చేశారు కాబట్టి ఈ మాత్రం ఖర్చయిందంటే ఆశ్చర్యమేమీ లేదు. పెద్ద హీరోల సినిమాల్లో పాటలకు కోట్లు ఖర్చు చేయడం మామూలే కానీ.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరో కోసం ఇంత ఖర్చు పెట్టడమంటే చిన్న విషయం కాదు.