సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహరాలన్నీ చాలా సింపుల్ గా మారిపోయాయి. ఎంత ఈజీగా లవ్ లో పడుతారనే అంతే ఈజీగా బ్రేకప్ లు చెప్పుకొని మరో జంటతో షికార్లకు వెళుతుంటారు. ఇక పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లయితే కొన్నాళ్లు కాపురం చేసి పిల్లలు కని విడాకులు తీసుకొని మరో పెళ్లికి సిద్ధమైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
అయితే ఇటీవల కాలంలో సెలబ్రెటీలు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. హీరోయిన్లు అయితే తమ కంటే తక్కువ వయస్సు యువకుడిని, హీరోలైతే తమ కంటే ఎక్కువ వయస్సు ఆంటీలను పెళ్లాడుతున్నారు. తొలినాళ్లలో ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్లో మొదలుకాగా క్రమంగా టాలీవుడ్, కోలివుడ్ కి సోకింది.
సెలబ్రెటీలు వయస్సు తేడాను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తమకు నచ్చివారితో కమిట్మెంట్ అవుతూ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ నటుడు తన కంటే 34 ఏళ్ల చిన్న అయిన యువతిని వివాహం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై తమిళ బిగ్ బాస్ బ్యూటీ కాజల్ హాట్ హాట్ కామెంట్స్ చేసింది.
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్(57) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'పెళ్లి' ఫేం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హస్యనటుడిగా, విలన్ గా నటించారు. పలు సీరియల్స్ లోనూ నటించారు. ఆయనకు 34 ఏళ్ల క్రితం బీనా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
గత కొంతకాలంగా తన భార్యగా దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే పృథ్వీరాజ్ మలేషియాకు చెందిన 23ఏళ్ల యువతిని సిక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు ఆయనపై విమర్శలు గుప్పించారు. కాగా తమిళ బిగ్ బాస్ బ్యూటీ కాజల్ పసుపతి మాత్రం పృథ్వీరాజ్ ను సమర్థిస్తూ ఓ పోస్టు చేయడం వైరల్ గా మారింది.
తన పోస్టులో ''అతడికి ఆ కెపాసిటీ ఉంది.. పెళ్లి చేసుకున్నాడు.. ఇందులో మీకు వచ్చే సమస్య ఏంటీ.. విష సమాజంలో అసూయపు మనుషులు'' అంటూ రాసుకొచ్చింది. కాజల్ పసుపతి పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా కాజల్ పసుపతి బిగ్ బాగ్ తొలి సీజన్లో 54వ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి 70రోజులపాటు కొనసాగింది. ఈ తర్వాత ఎలిమినేట్ అయింది.