సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తూ వారికి అవసరం అయిన సమాచారంను పోస్ట్ చేస్తూ ఉన్న సైబర్ నేరగాళ్లు ఈమద్య కాలంలో ఎక్కువ అయ్యారు. కొన్ని రోజుల క్రితం అమెరికాకు చెందిన ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ను హ్యాక్ చేసి వాటిలో బిట్ కాయిన్ కు సంబంధించిన ఒక పోస్ట్ ను పెట్టారు. అంతగా హ్యాకర్స్ రెచ్చి పోతున్నారు. తాజాగా తమిళ స్టార్ నటుడు ఎస్‌ఎంకే పార్టీ అధినేత శరత్ కుమార్ మొబైల్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన శరత్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మీడియా వరకు వచ్చింది.
కొన్ని రోజులుగా శరత్ కుమార్ మొబైల్ నెంబర్ తో కొందరికి కాల్స్ వెళ్తున్నాయి. శరత్ కుమార్ వాయిస్ తో మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తన మొబైల్ కు తన నెంబర్ నుండే కాల్ రావడంతో పాటు తన గొంతుతోనే మాట్లాడుతుండటంతో ఆశ్చర్య పోయిన శరత్ కుమార్ తన ఫోన్ హ్యాక్ అయినట్లుగా నిర్థారించుకున్నాడు.
ఈ విషయమై తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మొబైల్స్ కూడా హ్యాక్ చేస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సెలబ్రెటీలకు పోలీసులు సూచిస్తున్నారు. ఎవరి ఫోన్ నుండి కాల్ వచ్చినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు.