నమ్మించి మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మహిళా దర్శకురాలు విజయ పద్మ. నర్తకి అనే అట్టర్ ప్లాప్ మూవీకి దర్శకత్వం వహించిన ఆమె తమను నమ్మించి మోసం చేసినట్లుగా తాజాగా పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. తమిళనాడులోని తిరువాన్మయూర్ కు చెందిన మహిళ ఒకరు పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన ఫిర్యాదును పోలీసులకు ఇచ్చారు.
మాయ మాటలు చెప్పి మహిళా దర్శకురాలు విజయపద్మ తమను రూ.30లక్షల మేర మోసం చేసినట్లుగా సదరు మహిళ ఆరోపిస్తోంది. రాయల్ కేన్ పేరుతో సుమతి ఒక ఫర్నీచర్ షాపును నిర్వహిస్తుంటారు. వారి షాపునకు విజయపద్మ.. ఆమె భర్త ముత్తు తరచూ వచ్చేవారు. అలా మొదలైన వారి పరిచయం.. తాము చాలా రిచ్ అన్నట్లుగా వ్యవహరించేవారని చెప్పారు.
లీజు కోసం ఇల్లు అవసరమై వెతుకుతున్న విషయాన్ని తెలుసుకొని.. తమ ఇల్లు లీజుకు ఇస్తామని నమ్మబలికారని.. ఆ క్రమంలో రూ.30లక్షల మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారన్నారు. తీరా ఇంట్లో చేరే వేళలో.. ఆ ఇల్లు వారి సొంతం కాదన్న విషయం తెలిసినట్లు పేర్కొన్నారు.
దీంతో ఖంగుతిన్న సుమతి.. మహిళా దర్శకురాలిని నిలదీయగా.. రెండు చెక్కుల్ని ఆమెకు ఇచ్చారు. వాటిని బ్యాంకులో చూపిస్తే.. అకౌంట్లో డబ్బులు లేవని రిటర్న్ అయ్యింది. దీంతో తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న సుమతి తిరువాన్మయూర్ పోలీసులకు తాజాగా కంప్లైంట్ ఇచ్చారు. రీల్ లో మాదిరి తమకు మాయమాటలు చెప్పి మోసం చేసినట్లుగా ఆరోపించారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.