తన బాబాయి నందమూరి బాలకృష్ణ వందో సినిమాలో చిన్న సీన్ అయినా చాలంటున్నాడు తారకరత్న. ఇంతకుముందు బాలయ్య తన వందో సినిమాను కృష్ణవంశీతో చేయాలన్న ఆలోచన చేసినపుడు.. అందులో తారకరత్నకు కూడా ఓ పాత్ర ఉందన్న ప్రచారం జరిగింది. బాలయ్య కూడా ఆ విషయంలో హింట్ కూడా ఇచ్చాడు. ఐతే కృష్ణవంశీ సినిమా పక్కకు వెళ్లి.. క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తన వందో సినిమాగా ఎంచుకున్నాడు బాలయ్య. మరి ఇందులో తారకరత్నకు పాత్ర ఉందో లేదో కానీ.. తనకైతే ఆ సినిమాలో నటించాలని చాలా కుతూహలంగా ఉందని అతను చెప్పాడు. ‘‘ఆ సినిమాలో నాకు పాత్ర ఉందో లేదో తెలియదు. కానీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర అయినా.. చిన్న సీన్ అయినా పర్వాలేదు. అందులో నటించే అవకాశం వస్తే గ్రేట్ అని నా ఫీలింగ్’’ అని తారకరత్న చెప్పాడు.
ఇక నందమూరి కుటుంబ సభ్యులెవరితోనూ తనకు ఇబ్బందుల్లేవని.. జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లతోనూ తనకు మంచి సంబంధాలే ఉన్నాయని.. ఎవరికి వాళ్లు బిజీగా ఉండటం వల్ల కలవడం తక్కువ అని.. అంతమాత్రాన తాము కలవనే కలవం అనుకుంటే తప్పని.. కలిసినపుడు అందరం ఎంజాయ్ చేస్తామని తారకరత్న చెప్పాడు. పెళ్లి తర్వాత తన జీవితంలో ఏ మార్పూ రాలేదని.. ఐతే తన భార్య తానే పాత్ర చేస్తే బాగుంటుందో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ప్రోత్సహిస్తుందని చెప్పాడు. ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో తాను చేసిన విలన్ పాత్ర తన కెరీర్ కు ఓ మలుపు అవుతుందన్న తారకరత్న.. దీని తర్వాత ‘ఎవరు’ అనే థ్రిల్లర్లో నటిస్తున్నట్లు చెప్పాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టే ఆలోచన ఇప్పుడేమీ లేదని.. నటుడిగా నిలదొక్కుకున్నాక దాని గురించి ఆలోచిస్తానని తెలిపాడు.