బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలైన తర్వాత వచ్చిన ఆదరణ కారణంగా ఒక సీజన్ తర్వాత మరో సీజన్ అన్నట్లుగా సీజన్ల మీద సీజన్లు సాగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సీజన్ ఆరంభం నుంచి చివరి వరకు లీకు వీరులు చెప్పినట్లే బిగ్ బాస్ లో ట్విస్టులు చోటు చేసుకోవటం.. వాటి గురించి ముందే లీకు వీరులు లీకులు చెప్పేయటం తెలిసిందే. ఎప్పటి మాదిరే తాజాగా మరోసారి లీకు వీరుల దెబ్బకు బిగ్ బాస్ ఓడిపోయారు.
ఎలిమినేషన్ ప్రక్రియ చాలా సీక్రెట్ గా జరుగుతుందని.. ఎవరికి ఈ విషయాలు అంచనా వేయలేరని చెప్పే మాటలకు.. జరిగే పరిణామాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో జరుగుతున్నాయి. ఈ వారం ఎవరూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కారని.. అందరూ సేఫ్ గా హౌస్ లోనే ఉండిపోతారన్న లీకు వీరుల అంచనాలే నిజమయ్యాయి. హౌస్ లోకి వచ్చి వారమే కావటం.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్ననేపథ్యంలో ఎలిమినేట్ చేసి.. హౌస్ లో వేడి రగిలించే దానికి భిన్నంగా నిర్ణయం తీసుకొని..ఈసారికి నో ఎలిమినేషన్ అని తేల్చేశారు.
సన్ డే.. ఫన్ డే అన్న మాటకు తగ్గట్లే పలు ఆటల్ని ఆడించేశారు కింగ్ నాగార్జున. ఎవరికి ఎంత తెలుసు? అంటూ వెరైటీ గేమ్ ను ఆడించిన సందర్భంగా
'శ్రీహాన్ హౌజ్ లో మొదట ఏ ప్లేస్ కు వెళ్లాడు?'
'ఆర్ జే సూర్య ఎంతమందిని మిమిక్రీ చేయగలడు?'
'శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటూలు ఉన్నాయి?'
ఇలాంటి సరదా క్వశ్చన్లు అడగ్గా.. ఇంటి సభ్యులు పలువురు ఆన్సర్లు ఇచ్చారు. ఈ గేమ్ లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన బాలాదిత్య 'స్టార్ ఆప్ ది వీక్'గా నిలిచారు. అంతేకాదు.. బిగ్ బాస్ నుంచి ప్రత్యేకమైన ప్రైజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇలా ఆటలు ఆడుతూనే కావాల్సినంత ఫన్ క్రియేట్ చేయటంతో పాటు.. కొన్ని సందర్భాల్లో హౌస్ లో కన్నీటి ఎపిసోడ్ కు తెర తీశారు.
నామినేషన్ లో ఉన్న ఆరోహి..ఇనయా.. అభినయ శ్రీనులను నిలబెట్టి.. వారిపై ఏమైనా కంప్లైంట్లు ఉంటే చెప్పాలని మిగిలిన కంటెస్టెంట్స్ ను చెప్పాలని అడిగితే.. ఒక్కొక్కరు లేచి వారిపై తనకున్న కంప్లైంట్లను వివరించారు. ఇందులో ఎక్కువమంది అంటే పద్నాలుగురు ఇనయా సుల్తానా మీద కంప్లైంట్ చేశారు. దీంతో ఇనయా బెడ్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన సభ్యులు ఆమెను ఓదార్చారు. చివరగా ఇంటి సభ్యులంతా ఈ వారం సేవ్ అన్న విషయాన్ని చెప్పేయటంతో హౌస్ లో ఆనందం నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.