కోట్లు నొక్కేసి అమరావ‌తిలో ల్యాండ్ డీల్!

Update: 2019-06-03 07:27 GMT
సినిమావోళ్ల తెలివితేట‌లు.. మాయాజాలం గురించి ప్ర‌త్యేకించి జ‌నాల్లో ఫోక‌స్ ఉంటుంది. కార్మికుడు అయినా కాస్త తెలివితేట‌లు - టైమింగుతో రాటు దేల‌తారిక్క‌డ‌. పెద్ద హోదాలో ఉన్నవారు సైతం ఎన్నో గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్య‌లు ప్ర‌ద‌ర్శించాకే  పైకి ఎదిగిన వైనం బ‌య‌ట‌ప‌డుతుంటుంది. పిమ్మిని బ‌మ్మిని చేసే తెలివితేట‌లతో ఇక్క‌డ ఎంద‌రో ఎదిగేస్తున్న వైనంపై నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ఆ కోవ‌లోనే ఓ కార్మిక నాయ‌కుడి ఎదుగుద‌ల గురించి నిరంత‌రం ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది.

ఒక ప్రొడ‌క్ష‌న్ బోయ్ గా మొద‌లై.. అటుపై కార్మిక నాయ‌కుడిగా ఎదిగి .. ఆ త‌ర్వాత నిర్మాత‌గా సినిమా తీసేంత వ‌ర‌కూ ఎదురే లేకుండా ఎదిగాడ‌న్న మాట రెగ్యుల‌ర్ గానే ముచ్చ‌టించుకుంటారు. అయితే కార్మిక నాయ‌కుడు అయ్యాక మాత్రం కమిటీలు- హౌసింగ్ సొసైటీల వ్య‌వ‌హారంలో అత‌డిలో చేతివాటంపై పెద్ద చ‌ర్చ సాగింది. హౌసింగ్ అన్న పేరుతో అధికార ప‌క్షం - పోలీస్ అండ‌దండ‌ల‌తో పెద్ద మొత్తంలోనే దండుకుని బాగానే ఆర్జించాడ‌ని.. అలా ఆర్జించిన దాంట్లోంచి తెలివిగా భూములు కొన్నాడ‌ని ముచ్చ‌టించుకున్నారు.

అయితే రెండు ద‌శాబ్ధాల హార్డ్ వ‌ర్క్ ఫ‌లించి ఇప్ప‌టికి ప్ర‌తిఫ‌లం అత‌డికి అందుతోంద‌ని కొంద‌రు సింప‌థి కోణంలో విశ్లేషిస్తుంటారు. కార్మిక నాయ‌కుడిగా అత‌డికి మాస్ ఫాలోయింగ్ కూడా త‌క్కువేమీ కాదు. ఆయ‌న ఎదుగుద‌ల వెన‌క చాలానే డ్రీమ్ కూడా ఉంది. ఇక‌ ఏ రంగంలో అయినా ఎదిగేప్పుడు కొన్ని వ్య‌వ‌హారాలుంటాయి. వాటిని చూసీ చూడ‌న‌ట్టు పోవాల‌ని అంటారు. ఇక‌పోతే అధికార ప‌క్షాన్ని ఫుల్లుగా కాకా ప‌ట్ట‌డంలోనూ అత‌డు రాటు దేలి అప్ప‌ట్లో ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్యే గిరీ పైనా క‌న్నేశాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ పార్టీ ఇన్ సైడ్ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ వ‌ల్ల కుద‌ర‌లేదు. ఆ క్ర‌మంలోనే ప్ర‌ముఖ నాయ‌కుడి కుమారునికి అండ‌గా నిల‌బ‌డి  కార్మికుల‌తో ఓట్లు వేయించాడు. ఇక‌పోతే ఆయ‌న ఎపిసోడ్స్ లో 2 కోట్లు నొక్కేసి అమ‌రావతిలో భూములు కొన్నాడ‌ట‌. అమ‌రావ‌తి ప్ర‌క‌టించ‌క ముందే కొన్నాడు కాబ‌ట్టి ఇప్పుడు ఆ ఎక‌రాల విలువ అమాంతం ప‌దింత‌లు పెరిగింది. దీంతో తాజాగా మ‌రోసారి ఆ వ్య‌వ‌హారంపై ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ 2కోట్ల లాలూచీ వ్య‌వ‌హారంలోనే స‌ద‌రు కార్మిక నాయ‌కుడిని ఓ ప్ర‌ముఖ హౌసింగ్ సొసైటీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించారని ముచ్చ‌టించుకున్నారు. అయితే వ‌చ్చే ఏడాది మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అప్పుడు పోటీ చేసి మ‌ళ్లీ గెలిచేది కూడా ఆయ‌నే అన్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా కార్మిక నాయ‌కుడు.. క‌నిపెట్టండి చూద్దాం!!


Tags:    

Similar News