టాలెంట్ కాదు బిస్కెట్లు కావాలి!

Update: 2018-09-04 10:30 GMT
సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఆమాట కొస్తే ఇక్కడ ఋజువు చేసుకున్నవాళ్ళందరూ గొప్ప అని కాదు ఎక్కువ కాలం ఉండలేక వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతిభ లేదనీ కాదు. ఇక్కడ అవకాశాలు రావాలి అంటే దాంతో పాటు లౌక్యం చొరవ అవతలి వాళ్ళను ఈజీగా బుట్టలో వేసుకోగలిగే చాకచక్యం నేర్పు ఉండాలి. అలాంటి లక్షణాలు ఉంటే ఈజీగా బండి లాగించొచ్చు. ఇక పాయింట్ కు వద్దాం. అతనో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద హీరోల సినిమాలన్నీ దాదాపు ఇతని ఖాతాలోనే ఉన్నాయి. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తయిపోయింది. మరి అంత బిజీగా ఉన్నాడు అంటే చాలా గొప్ప ఆల్బమ్స్ ఏమైనా చేసుంటాడు అనే అభిప్రాయం కలగడం సహజం. నిజంగానే కెరీర్ ప్రారంభంలో గుర్తుపెట్టుకునే స్థాయిలో చక్కని ట్యూన్స్ తో మ్యూజిక్ లవర్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు. కానీ అది ఎంతో కాలం కాదు. మెల్లగా రొటీన్ లోకి మారిపోయాడు. హోరెత్తే బీట్స్ తప్ప హార్ట్ ని టచ్ చేసే కంపోజింగ్ ఉండటం లేదని బాహాటంగానే విమర్శలు అందుకోవడం మొదలుపెట్టాడు. అయినా తీరు మారలేదు.

అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. క్రేజీ ప్రాజెక్ట్స్ తన జేబులో వేసుకుంటూనే ఉన్నాడు. ఎలా రాజా అని ఆరా తీస్తే సదరు కళాకారుడు తన టాలెంట్ ని ట్యూన్స్ కట్టడంలో కాక నిర్మాతలు దర్శకులు హీరోలకు బిస్కెట్స్ వేయడంలో వాడుతున్నాడట. రాగాల ద్వారా కాకుండా తమ మాటల మంత్రాల ద్వారా బుట్టలో వేసుకుని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడని ఫిలిం నగర్ టాక్. ఇతని బెస్ట్ ట్యూన్ ఏదని గత మూడేళ్ళ ట్రాక్ రికార్డు చెక్ చేస్తే పది పాటలు కూడా లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. వేరే ఆప్షన్ లేకపోవడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఇతగాడు బాగానే వర్క్ చేయటం లాంటి కారణాల వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతన్నే రమ్మంటున్నారు. అదేదో సామెత చెప్పినట్టు అక్క మొగుడే గతిలా మా పరిస్థితి తయారయ్యిందని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేయటం నిజంగా ఆలోచించదగినదే. ఆన్ లైన్ వ్యూస్ అనే అంపశయ్య మీద ఆక్సిజన్ తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న తెలుగు సినిమా పాటను బ్రతికించకుండా తాము బ్రతికితే చాలు అనే ధోరణి ఇలాంటి కొందరిలో ఉండటం మూలాన పాత పాటల పిచ్చోళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
Tags:    

Similar News