విక్రమ్ కె కుమార్ పనితనం పైనా.. టెక్నిక్ పైనా అభిమానులకు చాలా పెద్ద గురి. 13బి- మనం- 24 లాంటి క్లాసిక్స్ తో అతడు ఎంతో గొప్ప మ్యాజిక్ చేసాడు. ఎంపిక చేసుకునే కథాంశం నుంచి ప్రతిదీ విభిన్నంగా ఆలోచిస్తాడు. సాంకేతికంగా అత్యున్నతంగా సినిమాని మలచడంలోనూ గొప్ప టెక్నీషియన్ గా నిరూపించాడు. కానీ కొంత కాలంగా ఎందుకనో అతడు విఫలమవుతున్నాడు.
ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. ఈసారి నాగచైతన్య 'థాంక్యూ'తో ఏదైనా మ్యాజిక్ సాధ్యమవుతుందని ఆశిస్తే అతడు మరోసారి తీవ్రంగా నిరాశపరచడం చర్చనీయాంశమైంది.
చై-విక్రమ్ కె కాంబో మూవీ థాంక్యూ ఇంటా బయటా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను తేవడంలో చతికిలబడింది. ముఖ్యంగా తనకు భారీ ఫాలోయింగ్ ఉన్న అమెరికా ఓవర్సీస్ లో విక్రమ్.కె ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు.
థాంక్యూ ఆ రకంగా ఫెయిల్యూర్ గా నిలిచింది. విక్రమ్ కె గత చిత్రాలు 24 - హలో లాంటి చిత్రాలు అమెరికాలో బాగా వసూలు చేసినా 'థాంక్యూ' విషయంలో రివర్స్ అయ్యింది. అమెరికా ఎన్నారైలు సైతం ఈ సినిమాని మెచ్చలేదు. మొత్తానికి ఇంటా బయటా ఫలితం తేలిపోయింది. ఇక అమెరికాలో ఈ మూవీ 200 కంటే ఎక్కువ లొకేషన్లలో విడుదలైనా కానీ తక్కువ వసూళ్లు దక్కాయి.
థాంక్యూ మొదటి వారాంతంలో కేవలం 165 కె డాలర్లు మాత్రమే వసూలు చేసింది. గురువారం- 81047 డాలర్లు.. శుక్రవారం- 41397 డాలర్లు ... శనివారం-27702 డాలర్లు.. ఆదివారం -15కె డాలర్లు వసూలు చేయగా.. మొత్తం వారాంతపు గ్రాస్- 165కె (దాదాపు) వసూలు చేసింది.
విక్రమ్ కె తెరకెక్కించిన క్లాసిక్ మూవీ 'మనం' జీవితకాలంలో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కానీ థాంక్యూ 200 కె డాలర్లు కూడా తేవడం కష్టంగా ఉందని ట్రేడ్ చెబుతోంది. నాగచైతన్య ప్రస్తుతం తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. అతడు నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టులో విడుదలవుతోంది.