గత ఏడాది ఇండియాలో మీటూ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న విషయం తెల్సిందే. మీటూ ఉద్యమం ఇండియాలో ఆ స్థాయికి వెళ్లడంకు ప్రధాన కారణం తనూ శ్రీ దత్తా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె 2008వ సంవత్సరంలో నానా పటేకర్ వల్ల ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చిలికి చిలికి గాలి వానలా మారి పెద్ద దుమారంను రేపడం జరిగింది. ఆ వివాదం కాస్త పెద్దది అవ్వడంతో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు.
నానా పటేకర్ పై లైంగిక వేదింపుల కేసును బుక్ చేయడం జరిగింది. లైంగిక వేదింపుల కేసులో గత ఆరు నెలలుగా నానా పటేకర్ తో పాటు పలువురిని విచారించిన పోలీసులు వేదింపులకు సాక్ష్యం లేదని.. ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవిగా నిర్ధారించారు. పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి నానా పటేకర్ కు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయమై తనూశ్రీ దత్తా సీరియస్ గా స్పందించింది. ఈ సమయంలో ఆమె పోలీస్ వ్యవస్థను కించపర్చే విధంగా మాట్లాడి విమర్శలపాలయ్యింది.
పోలీసు వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అనేది ఇండియన్ చట్టం చెబుతుంది. అందుకే నానా పటేకర్ కు క్లీన్ చీట్ దక్కింది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకు పోయింది అంటూ తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు వ్యవస్థలు కూడా అంతకు మించిన అవినీతి పరుడికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆమెపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.