బాలీవుడ్ లో వున్న క్రేజీ జంట అలియా భట్, రణ్ బీర్ కపూర్. ఈ లవ్ బర్డ్స్ ఇటీవల వివాహం చేసుకోవడం, అలియా ప్రెగ్నెంట్ కావడం తెలిసింది. అయితే పెళ్లికి ముందు ఈ ప్రేమ జంట నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'బ్రహ్మాస్త్ర'.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలిసి స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ ఫిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించాయి. రణ్ బీర్, అలియాల పెళ్లి తరువాత విడుదలైన సినిమా కావడం విశేషం.
భారీ అడ్డంకుల మధ్య విడుదలైన ఈ మూవీ ఫస్ట్ వీక్ ఊహించని విధంగా వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది. అయితే మండే నుంచి క్రమ క్రమంగా ఈ మూవీ ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీస్ ముందు అలియా భట్, రన్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా రన్ బీర్ చేసిన పని నెట్టింట ట్రోలింగ్ కు గురవుతోంది.
అలియాభట్, రణ్ బీర్ కపూర్ గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురవుతున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ సందర్భంగా అలియా భట్ బాయ్ కాట్ వివాదంపై ఘాటుగా స్పందించడం, అంతకు ముందు అలియా బేబి బంప్ పై రణ్ బీర్ సిల్లీగా స్పందించడం నెట్టింట వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ రెండు విషయాలపై ఈ ఇద్దరి ఆడుకున్న నెటిజన్ లకు తాజాగా మరోసారి అడ్డంగా దొరికి అలియా, రణ్ బీర్ మరో సారి బుక్కయ్యారు.
కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడటానికి అలియా, రణ్ బీర్ సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో రణ్ బీర్ క్రాఫ్ ని అలియా సరిచేసే ప్రయత్నం చేసింది. రెండవ సారి కూడా రణ్ బీర్ క్రాఫ్ ని సెట్ చేయడానికి అలియా ప్రయత్నించడంతో రణ్ బీర్ వెంటనే ఆమె చేయిని పక్కకు తోసేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ లు ఈ కొత్త జంటని ఏకి పారేస్తున్నారు.
కొంత మంది అలియా .. రణ్ బీర్పై చూపిస్తున్న కేర్ ని గమనించి సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం రణ్ బీర్ ని సపోర్ట్ చేస్తూ అలియాని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించగా అంచనాల మధ్య విడుదలైన 'బ్రహ్మాస్త్ర' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కలెక్షన్స్ పడిపోతున్న నేపథ్యంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధించడం కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.