బాలీవుడ్ నటి లారా దత్త్ మూడేళ్ల తర్వాత `బెల్ బాటమ్` చిత్రంతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాలుగా బాలీవుడ్ లో నటిగా కొనసాగుతున్నా లారా కెరీర్ మాత్రం ఎగుడుదిగుడుగానే సాగింది. బిజీ నటిగా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది.
ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాలతోనే కెరీర్ ని ముందుకు తీసుకెళుతోంది. ఇటీవల వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ వేదికగా అక్కడ మాత్రం బిజీగానే ఉంది. తాజాగా `హిక్కాప్స్ అండ్ హుక్కాప్స్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. లయన్స్ గేట్ ఇండియా సంస్థ దీన్ని నిర్మిస్తోంది.
త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దాన్ని టార్గెటెడ్ గా చేసిన ఓ నెటిజనుడు లారా దత్ ఫోన్ కవర్ ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్ చేసాడు. `నేను పేదవాడిని కాబట్టి ఫోన్ కవర్ ని మార్చలేదు.
లారాదత్తాని చూడండి. ఆమె మొబైల్ ఫోన్ కవర్ రెండేళ్లు అదే ఉంది. కాస్త పాతబడినట్లు కనిపిస్తోందని కామెంట్ చేసాడు. దీనికి లారా బదులిస్తూ నిజమే 2 ఏళ్లుగా నేను కవర్ మార్చలేదు. ఎందుకంటే కొన్ని వస్తువులు సెంటిమెంట్ గా అలాగే ఉంచుకోవాలనిపిస్తోంది. అందులో నా ఫోన్ కవర్ ఒకటి అని సమాధానం ఇచ్చింది. ఫోన్ కవర్ నే అంతగా ప్రేమిస్తే సఖుడిని ఇంకెంతగా ప్రేమిస్తుందో! అంటూ అభిమానులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఓ నటి ఇలా కూల్ గా సమాధానం ఇవ్వడం గొప్ప విషయం. ఇలాంటి కామెంట్లు చూస్తే హీరోయిన్లు మండిపడతారు. కౌంటర్ ఎటాక్ కి దిగుతారు. కానీ లారా మాత్రం చాలా వినయంగా సమాధానం ఇవ్వడం విశేషం. అలాగే కొన్ని రోజుల క్రితం లారా దత్తా పేరుతో డేటింగ్ యాప్ లో ఆమె పేరుతో ఓ ప్రోఫైల్ దర్శనమిచ్చింది.
దానిపై కూడా లారా క్లారిటీ ఇచ్చింది. నా పేరుతో ఎవరో కావాలనే అకౌంట్ క్రియేట్ చేసారు. నేను ఎలాంటి డేటింగ్ యాప్స్ లో లేనని` తెలిపింది. లారా దత్తా టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వారసులు ఉన్నారు.