బాలీవుడ్ స్టార్స్ మద్య ఎంత పోటీ ఉన్నా కూడా అందరు కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అందరు స్టార్ హీరోలతో స్నేహంగా ఉంటాడని అనుకుంటూ ఉంటారు. ఆమద్య తాను నటించిన రెండు మూడు సినిమాల్లో పలువురు స్టార్స్ ను షారుఖ్ నటింపజేసిన విషయం తెల్సిందే. షారుఖ్ తో పాటు ఇతర స్టార్ హీరోలు కూడా కలిసి పోయి స్నేహంగానే ఉంటారని అందరి అభిప్రాయం. కాని తాజాగా సీనియర్ బాలీవుడ్ హీరో సన్నీడియోల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.
సన్నీడియోల్ మాట్లాడుతూ... తాను షారుఖ్ ఖాన్ తో 16 సంవత్సరాలుగా మాట్లాడటం లేదు. 1993లో వచ్చిన 'డర్' చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన కారణంగా తాను అతడితో మాట్లాడటం లేదని చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి తామిద్దరం ఎక్కువ ఎదురు పడలేదు.. ఒకవేళ ఎదురు పడ్డా కూడా మాట్లాడుకునే సందర్బం రాలేదని చెప్పుకొచ్చాడు. డర్ సినిమా సమయంలో తన ఈగో హర్ట్ అయ్యేలా దర్శకుడు వ్యవహరించిన కారణంగానే షారుఖ్ తో విభేదించినట్లుగా చెప్పుకొచ్చాడు.
డర్ చిత్రం షూటింగ్ సందర్బంగా షారుఖ్ నన్ను కత్తితో పొడిచే సీన్ ను దర్శకుడు యశ్ చోప్రా ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమాలో నేను ఒక కమాండో పాత్ర పోషించాను. కమాండో అంటే చాలా బలమైన వ్యక్తిలా చూపించాలి. అలాంటి పాత్రను ఒక చిన్న కుర్రాడు కత్తితో పొడిస్తే ఏం బాగుంటుందని నేను దర్శకుడితో అన్నాను. కాని ఆయన నా మాట వినలేదు. ఆయన పెద్ద వారు అవ్వడంతో నేనేం మాట్లాడలేక పోయాను. ఆ సమయంలో నాకు పట్టరాని కోపం వచ్చినా కూడా ఊరుకున్నాను అన్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇంకా పలు సంఘటనలు జరిగాయని అందుకే షారుఖ్ తో కూడా విభేదాలు తలెత్తాయని సన్నీడియోల్ పేర్కొన్నాడు.