నాయకి కష్టాలు ఇన్నిన్ని కావు..

Update: 2016-07-16 06:44 GMT
‘నాయకి’ మొదలైనపుడు జనాలకు ఆ సినిమాపై బాగానే ఆసక్తి కలిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు అప్పట్లో జనాల్లో బాగా ఆసక్తి రేకెత్తించాయి. దీనికి తోడు ఆడియో ఫంక్షన్ కొంచెం గట్టిగా చేయడం.. బాలయ్య కూడా ముఖ్య అతిథిగా రావడంతో సినిమాకు కొంచెం హైప్ వచ్చింది. కానీ ఆ తర్వాత సరైన ప్రమోషన్ లేకపోవడం సినిమాకు శాపమైంది. కథానాయికగా నటించిన త్రిషే ఈ సినిమాను పట్టించుకోవడం మానేసింది. చాన్నాళ్లు వార్తల్లో లేకుండా పోయిన ‘నాయకి’ ఈ శుక్రవారమే పెద్దగా సందడి లేకుండా విడుదలైంది. సినిమా మీద పెద్దగా హైప్ లేకపోవడంతో చాలా తక్కువ థియేటర్లిచ్చారు ఈ సినిమాకు. నిజానికి ‘జెంటిల్ మన్’ తర్వాత సరైన సినిమా పడక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వెలవెలబోతున్నాయి. కాస్త పేరున్న సినిమాకు కూడా బాగానే థియేటర్లు బాగానే దక్కుతున్నాయి. అల్లరి నరేష్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ‘సెల్ఫీ రాజా’కు అతడి కెరీర్లోనే అత్యధిక థియేటర్లు దక్కాయి. కానీ ‘నాయకి’కి మాత్రం ఆ అవకాశం రాలేదు. చాలా తక్కువ థియేటర్లిచ్చారు.

దీనికి తోడు శుక్రవారం.. తొలి రోజు ‘నాయకి’ కేవలం సింగిల్ స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది. కారణమేంటో తెలియదు కానీ.. మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను ప్రదర్శించలేదు. సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేది తొలి రోజే. అలాంటిది మల్టీప్లెక్సుల్లో సినిమా పడలేదంటే ఆదాయానికి బాగానే కోత పడి ఉంటుంది. రెండో రోజు నుంచైనా సినిమాను మల్టీప్లెక్సులు ప్రదర్శిస్తున్నాయో లేదో తెలియ్లేదు. అసలే సినిమా మీద హైప్ లేదు.. రిలీజ్ చేసింది తక్కువ థియేటర్లలో.. పైగా టాక్ కూడా ఆశాజనకంగా లేదు. దీనికి తోడు మల్టీప్లెక్సులు సినిమాను ప్రదర్శించట్లేదంటే.. ‘నాయకి’ నిర్మాతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News