దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'సైమా' అవార్డులను (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. 2012 నుండి ప్రతీ ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అత్యుత్తమ సినిమాలని గుర్తించి వివిధ విభాగాల్లో అవార్డులు ప్రధానం చేస్తూ వస్తున్నారు.
సైమా-2022 అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది బెంగళూరులో జరుగుతోంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుక.. మరికొద్ది సేపట్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను ప్రత్యేకంగా మార్చడానికి మొదటి రోజు పాన్ ఇండియా స్టార్స్ హాజరవురున్నారు.
విశ్వ నటుడు కమల్ హసన్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కన్నడ రాకింగ్ స్టార్ యష్ - రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈరోజు 'సైమా' అవార్డ్స్ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. వీరంతా ఇప్పటికే బెంగుళూరుకు చేరుకున్నారు. వీరితో పాటు నాలుగు సౌత్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.
కాగా, సైమా గత పదేళ్లుగా నాలుగు దక్షిణాది భాషల్లో వివిధ చిత్రాలకు అవార్డులను అందిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న 10వ ఎడిషన్ అవార్డ్స్ ను 2021లో విడుదలైన చిత్రాలకు ప్రదానం చేయనున్నారు. దీని కోసం ఇటీవల నామినేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో 'పుష్ప: ది రైజ్' చిత్రం అత్యధిక నామినేషన్లు సాధించగా.. తమిళంలో 'కర్ణన్' - కన్నడలో 'రాబర్ట్' - మలయాళంలో 'మిన్నల్ మురళి' చిత్రాలు వివిధ కేటగిరీల్లో ఎక్కువ నామినేషన్లు పొందాయి.
'పుష్ప' చిత్రానికి 12 విభాగాల్లో సైమా నామినేషన్లు వచ్చాయి. 'అఖండ' మూవీ 10 నామినేషన్స్.. 'ఉప్పెన'మరియు 'జాతిరత్నాలు' చిత్రాలు చెరో 8 నామినేషన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 'క్రాక్' సినిమా కూడా పలు కేటగిరీలలో వీటితో పాటుగా పోటీ పడుతోంది.
తమిళ్ లో 'కర్ణన్ సినిమాకు 10 నామినేషన్లు రాగా.. 'డాక్టర్' (9).. 'మాస్టర్' & 'తలైవి' (7) సినిమాలు నామినేషన్లలో ఉన్నాయి. కన్నడలో రాబర్ట్ (10) - గరుడ గమన వృషభ వాహన (8) - యువరత్న (7) సినిమాలు అధిక నామినేషన్లు సాధించాయి. మలయాళంలో మిన్నాల్ మురళి (10) - కురుప్ (8) - మాలిక్ (6) చిత్రాలకు ఎక్కువ నామినేషన్లు వచ్చాయి.
సైమా అవార్డులను ఆన్ లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దీని కోసం www.siima.in వెబ్ సైట్ లేదా సైమా అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓటింగ్ నిర్వహించారు. మరి నామినేషన్స్ లో ఏయే సినిమాలకు అవార్డులు వరిస్తాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.