సత్యదేవ్ పేరిప్పుడు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. `గాడ్ ఫాదర్` లో చిరంజీవినే ఢీ కొట్టడంతో సత్యదేవ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంది వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగాడు. నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఇంత కాలం ఎలాంటి అవకాశం కోసం ఎదురు చూసాడో? అదే ఛాన్స్ తలుపు తట్టడం..అది సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్.
నటుడిగా సత్యదేవ్ మరింత బిజీ అవ్వడం ఖాయం. ఇకపై అతను సహాయ నటు పాత్రల నుంచి అప్ గ్రేడ్ అయినట్లే. నటుడిగా నటనకు మరింత ఆస్కారం ఉండే పాత్రల్లో నటిస్తాడు. స్టార్ హీరోలకు ధీటైన విలన్ గా అవకాశాలు అందుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి హీరోగా సత్యదేవ్ రాణించలేడా? అంటే ప్రేక్షకులు అతన్ని హీరోగా ఎంత వరకూ అంగీకరిస్తారు అన్నది కంటూన్యూస్ గా సినిమాలు చేస్తే తప్ప చెప్పలేని పరస్థితి.
త్వరలో అతను హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. `గుర్తుందా శీతాకాలం` అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాలి. అనివార్య కారణాలతో డిలే అవుతుంది. డిసెంబర్ 9న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అలాగే `కృష్ణమ్మ` అనే మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంత పనుల్లో ఉంది. అయితే ఈ రెండు సినిమాల ఫలితాల కొంత వరకూ సత్యదేవ్ హీరోగా వర్కౌట్ అవుతాడా? లేదా? అన్నది తేల్చే ఛాన్స్ఉంది. నటుడిగా అతన్ని ఎంచడానికి ఏం లేదు. ఆ పాత్ర స్వరూపం ఎలా ఉంటుందన్నది చూడాలి.
సినిమాలో విషయం ఉండి...తన పాత్రతో ప్రేక్షకల్ని ఎంగేజ్ చేయగల్గితే సక్సెస్ దగ్గర్లో ఉన్నట్లే. ఎందుకంటే విషయం లేని సినిమాలో స్టార్ హీరోలే తెరపై కనిపించినా ప్రేక్షకులకు యాక్సప్ట్ చేయరు. ఇమేజ్ తో కేవలం ఓపెనింగ్స్ మాత్రమే సాధ్యం.
ఇప్పుడొస్తున్న సినిమాలు ఇమేజ్ తో కాకుండా కంటెంట్తో జనాల్ని థియేటర్ కి రప్పిస్తున్నాయి. ఆ కోవలో శీతాకాలం..కృష్ణమ్మ నిలిస్తే సత్యదేవ్ హీరోగా పాస్ అయినట్లే. ఈ రెండుగాక `ఫుల్ బాటిల్` అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు.