సూపర్ స్టార్ రజనీకాంత్ బరిలో దిగుతున్నారు. ఈ దీపావళిని తన ఖాతాలో వేసుకోవాలని ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతున్నారు. అతడు నటించిన అన్నాథే (తమిళం) తెలుగులో `పెద్దన్న` పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ కోసం థియేటర్లను పెద్దన్న బృందాలు లాక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని తమిళనాడులో అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో దాదాపు 1100 థియేటర్లను లాక్ చేశారంటే రజనీ సినిమాని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాని అసాధారణంగా రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు ప్రజల్లో భారీ అంచనాలను పెంచిన అన్నాథే భారతదేశంలో లాగా విదేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుండడం ఆశ్చర్యపరుస్తోంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్ లో అత్యంత భారీగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని పేర్కొంది. ఒక్క అమెరికాలోనే 677 థియేటర్లలో ప్రదర్శితమవుతుందని సన్ పిక్చర్స్ ఒక ట్వీట్ లో తెలిపింది. అలాగే యూఏఈలో ఈ చిత్రం 117 స్క్రీన్లలో విడుదల కానుంది. నిజానికి సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ అంత పెద్ద వేవ్ తో రిలీజవుతున్న వేరొక చిత్రం లేదు.
సూపర్ స్టార్ అన్నాథే పోస్టర్లు టీజర్ ట్రైలర్ తో నే బోలెడంత హైప్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సునామీ సృష్టిస్తుందని అంచనాలేర్పడ్డాయి. తళా అజిత్ కి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బంపర్ హిట్లు ఇచ్చిన దరువు శివ ఇప్పుడు సూపర్ స్టార్ కి కూడా అంతే పెద్ద హిట్టిస్తారని అభిమానులు భావిస్తున్నారు. దీపావళి కానుకగా 4 నవంబర్ అన్నాథే రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. పెద్దన్న గా వస్తున్న తాజా చిత్రంలో రజనీ మార్క్ ఎలివేషన్స్ కి కొదవేమీ ఉండదని ఇంతకుముందు రిలీజైన టీజర్ ట్రైలర్ వెల్లడించాయి.