నటవారసులు సినీసోదర భావం రాజ్యమేలే చోట కొత్త కుర్రాళ్లు హీరోలుగా వచ్చి నిలదొక్కుకోవడం అంటే మిరాకిలే. అయితే ఇలాంటి పరిశ్రమలోనూ కొందరు ప్రతిభావంతులు ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా పేరు తెచ్చుకుని టాలీవుడ్ లో లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇదే కేటగిరీలో హీరో సత్యదేవ్ పేరు మార్మోగుతోంది.
సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నెమ్మదిగా బిజీ అవుతున్నాడు. అతడు నటించిన `గాడ్సే` సినిమా పోస్టర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్ `తిమ్మరుసు` నిర్మాతలు అతడి పుట్టినరోజు స్పెషల్ గా కొన్ని సెకన్ల నిడివితో కిక్కిచ్చే టీజర్ ను విడుదల చేశారు. తెలివితేటలు మూర్ఖత్వం మధ్య సన్నని గీత ఉంటుందని రవిబాబు వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. సత్యదేవ్ తాను అధ్యయనం చేసిన చట్టం ప్రకారం.. ఆ సన్నని రేఖకు ఒక వైపు అన్యాయం ..మరొక వైపు న్యాయం అవసరమని చెబుతుండడం పూర్తి కాంట్రరీ అనిపిస్తుంది. మనిషిలో సంఘర్షణకు సంబంధించిన సంభాషణలు పవర్ ఫుల్ గా వినిపించాయి.
సత్యదేవ్ ఒక న్యాయవాదిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇక ఈ సంఘంలో న్యాయం కోసం అతడి పోరాటం ఎలా ఉండనుంది? అన్నది పూర్తి సినిమాలో చూడాల్సిందే. తాజా టీజర్ లో యాక్షన్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. సత్యదేవ్ లుక్ కూడా ఇంప్రెస్సివ్. షార్ట్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. 30 సెకన్ల టీజర్ ఒక ప్రత్యేక ముద్ర వేసింది.
తిమ్మరుసు చిత్రం మేలో విడుదల కావాల్సి ఉండగా.. రెండవ వేవ్ వల్ల ఈ సినిమాని వాయిదా వేసారు. థియేటర్లు పూర్తిగా తెరిచిన తర్వాత మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. నిఖిల్ `కిరిక్ పార్టీ`కి దర్శకత్వం వహించిన శరణ్ కొప్పిసెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీజన్ యరబోలు ఒక నిర్మాత. గుర్తుందా సీతాకాలం..చిత్రంలోనూ సత్యదేవ్ నటిస్తున్నారు. తదుపరి సత్యదేవ్ నటిస్తున్న 25వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
Full View