స్లాంగురే బంగారు రాజా

Update: 2015-11-04 03:53 GMT
తెలుగు సినిమాలలో ఎన్ని ప్రయోగాత్మక చిత్రాలు వచ్చినా, ఎన్నో ఫీల్ గుడ్ మూవీస్ మనసుని గుచ్చినా ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకున్న గుర్తింపే వేరు. చూస్తున్నంత సేపు కష్టాలను మర్చిపోయి హాయిగా నవ్వుకునే సినిమాలకే ప్రేక్షకుడి మొదటి ఓటు. అయితే కామెడి పండించడం అంత వీజీకాదు. అటువంటి కామెడీకి తమ స్లాంగ్ తో కొత్త డెఫినిషన్ తెచ్చిన నటులు కొందరు..

పంచ్ డైలాగ్ ని ఫాస్ట్ గా చెప్పి ప్రేక్షకుల మనసులోకి స్పీడ్ గా దూరిపోవడం భీమవరం బుల్లోడు సునీల్ స్పెషాలిటీ అయితే అదే పంచ్ ని గోదావరి ఎటకారంతో నిదానంగా చెప్తూ టైమింగ్ పాటించడం కృష్ణ భగవాన్ ప్రత్యేకత. అయితే ప్రస్తుతం వీరిద్దరూ వెండితెరకు నవ్వులు పూయించడంలో చిన్న బ్రేక్ తీసుకున్నారు.

ప్రస్తుత తరం కమెడియన్ లు కూడా ఈ స్లాంగ్ మీదే హై లైట్ అవుతున్నారు. చిత్తూరు జిల్లా యాసతో సప్తగిరి రఫ్ఫాడిస్తున్నాడు. ఈ మధ్యే పాపులర్ అవుతున్న షకలక శంకర్ శ్రీకాకుళం అమాయకత్వంతో అల్లరి చేస్తున్నాడు. ఇక షార్ట్ ఫిలింనుండి మెయిన్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేస్తున్న సుదర్శన్, వైవా హర్షలు తమ తమ ప్రాంతాల యాసతో ప్రజలను నవ్విస్తున్నారు. 
Tags:    

Similar News