టాప్ స్టోరి: వెట‌ర‌న్ స్టార్స్ ఫామ్ హౌస్ క‌హానీ

Update: 2019-12-20 04:08 GMT
టాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్ల‌ కు ఊటీ తో ద‌శాబ్దాలుగా విడ‌దీయ రాని బంధం వున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు ఎవ‌రు ఏ సినిమా తీసినా ఊటీ లొకేష‌న్ త‌ప్ప‌నిస‌రి. ఎన్టీఆర్-ఏఎన్నార్-కృష్ణ కాలంలో ఊటీ లో షూటింగులు చాలా ఫేమ‌స్. ప్ర‌తి సినిమాలో క‌నీసం ఓ పాట అయినా ఊటీలో తెర‌కెక్కాల్సిందే అన్నంత  సెంటిమెంట్ ఉండేది. అక్క‌డి అహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం.. నేచుర్ క‌ట్టిప‌డేస్తుంది. అందుకే చాలా మంది న‌టీన‌టులు ఊటీ పేరెత్తితే చాలు ఎగిరిగంతేసేవార‌ట‌. ఊటీ పై వెట‌ర‌న్ స్టార్లు ప్ర‌త్యేక‌మైన ఇష్టాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు.

అలా ఊటీ అంటే తొలి ప్రాధాన్య‌త ఇచ్చే న‌టుల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఒక‌రు. ఆయ‌న సినిమాల‌కు ఎక్కువ‌గా ఊటీ లొకేష‌న్స్ ని ప్రిఫ‌ర్ చేసేవార‌ట‌. అక్కడి ప్ర‌శాంత‌ వాతావ‌ర‌ణానికి ఫిదా అయిన సూప‌ర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాది 20 చిత్రాల్లో న‌టిస్తే అవ‌న్నీ ఊటీలో కొంత భాగం షూటింగ్ జ‌రుపుకోవ‌డం రికార్డుగా చెప్పుకుంటారు సినీ జ‌నం. ఊటీ పై మ‌క్కువ ఎక్కువ కావ‌డంతో ఆ రోజుల్లోనే అక్క‌డ కృష్ణ ఓ ఫామ్ హౌస్ తో పాటు ఓ మామిడి తోట‌ని తీసుకున్నార‌ట‌. ఇప్ప‌టికీ అక్క‌డికి వెళుతుంటార‌ని.. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తుంటార‌ట‌. ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఊటీలో వున్న మామిడి తోట‌లో ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో అభిమానుల‌తో పంచుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కృష్ణ ఊటీలో ఫామ్ హౌస్ తో పాటు మామిడి తోట‌ని సొంతం చేసుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి.. త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ బెంగ‌ళూరులో సుమారు 20 ఎక‌రాల తోట‌లో ఫామ్ హౌస్ ల‌ను నిర్మించుకున్నారు. ఈ ఫామ్ హౌస్ లు ద‌ట్ట‌మైన అడ‌వికి అతి స‌మీపంలో వుంటాయ‌ని.. ఆ అడ‌విలోక్రూర మృగాలు ప్ర‌మాద‌క‌రంగానే సంచ‌రిస్తుంటాయ‌ని స‌మాచారం ఉంది. అయితే అక్క‌డికి వాతావ‌ర‌ణం మాత్రం చాలా పీస్ ఫుల్ గా బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం లేకుండా ఉంటుంద‌ట‌. ఇక్క‌డ తోట‌లో ప్ర‌తియేటా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ చేస్తుంటుంది. చ‌ర‌ణ్- బ‌న్ని స‌హా మెగా హీరోలు ప్ర‌కృతి వైద్యం.. రిలాక్సేష‌న్ ఇక్క‌డే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోనే కొన్ని ఎక‌రాల మామిడితోట ఉన్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ఇత‌ర బ‌డా స్టార్ల‌కు హైద‌రాబాద్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో ఔట్ స్క‌ర్ట్స్ లో భారీగా తోట‌లు ఉన్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. ఇక మిగ‌తా స్టార్ ల‌కు హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌న వున్న ప‌ల్లెల్లో ఫామ్ హౌస్ లు వున్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News