ఇప్పటికే త్రిషమ్మకు అస్సలు తెలుగులో దేఖేవారే లేరు. ఎందుకంటే వరుసగా ఫ్లాపులు రావడమే కాదు.. అస్సలు అమ్మడి చేతిలో పెద్ద ఆఫర్లు ఒక్కటి కూడా లేవు. ఎప్పుడు ఓ నాలుగేళ్ళ క్రిందట దమ్ము.. ఆ తరువాత మొన్న లయన్.. ఈ రెండూ తప్పిస్తే డైరెక్టు తెలుగు సినిమాయే లేదు. ఇకపోతే ఇప్పుడు ఈవిడ మేనేజర్ గిరిధర్ ''నాయకి'' అనే సినిమాను తీస్తున్నాడు. ఇదో తెలుగు - తమిళ బైలింగువల్. ఇంతకీ ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారట?
అన్నీ బాగుంటే.. కాలం కలిసస్తే.. హ్యాపీగా జనవరి 8న ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. ఛ అంతుందా? నిజానికి ఏ సినిమా ఏ తేదీన అయినా రావొచ్చు. కాకపోతే అస్సలు ఏ మాత్రం హిట్టనేది లేని త్రిషకు.. కనీసం మొన్న చీకటి రాజ్యంతో కూడా కాస్తయినా ఇమేజ్ వాల్యూ పెరగని త్రిషకు.. భారీగా ప్రమోషన్లు చేసి రిలీజ్ చేయడం అవసరం. మొన్నామధ్య అమ్మడు చీకటి రాజ్యం ప్రమోషన్ కోసం తమిళంలో సినిమా రిలీజ్ అయ్యాక తెలుగులో కేవలం ప్రీమియర్ షో చూడ్డానికే వచ్చింది. ఈ రేంజులో ప్రమోషన్ చేస్తే అసలు నాయకి సినిమాకు రిలీజ్ రోజున హాలు కాదు కదా.. ఒక్క వరుస కూడా నిండదేమో. అవన్నీ చూసుకోకుండా.. ఇప్పుడే సంక్రాంతి రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ లీకులిస్తుంటే కాస్త ఓవర్ గానే ఉంది.
ఒకవేళ జనవరి 8కే రావాలంటే మాత్రం.. త్రిషమ్మ ప్రమోషన్ చేయాలి.. ధియేటర్లు బుక్ చేసుకోవాలి.. భారీ రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి.. ఇంటర్యూలు.. ప్రెస్ మీట్లు.. అబ్బో ఆ సీన్ వేరయా!!