నష్టాలవాసిని కాపాడే యత్నం!!

Update: 2018-01-23 12:28 GMT
కొత్త సంవత్సరానికి ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ కు వెల్కమ్ చెబుతుందని ఆశించిన అజ్ఞాతవాసి ఇచ్చిన స్ట్రోక్ నుంచి కోలుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లకు ఇంకొంత టైం పట్టేలా ఉంది. నూట పాతిక కోట్లకు పైగా బిజినెస్ జరిగి అందులో సగం కూడా వెనక్కు తేలేనంత డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా గురించి కనీసం తలుచుకోవడానికి కూడా ఫాన్స్ ఇష్టపడటం లేదు. ఇక నష్టాల లెక్కలు చాలానే తేలాల్సి ఉంది. యావరేజ్ టాక్ వచ్చినా పవన్ ఇమేజ్ - సెలవులు కలిసి రావడం సినిమాను ఎలాగోలా గట్టేక్కించేవి. కాని నెగటివ్ టాక్ దానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. సినిమాను నిర్మించిన హారికా అండ్ హాసిని బ్యానర్ ఇమేజ్ ని సైతం ఇది డ్యామేజ్ చేయటంతో నిర్మాత రాధాకృష్ణ దాన్ని రిపేర్ చేసే పనిలో పడ్డారట. దీనికి సంబంధించి పంపిణిదారుల సమావేశం జరిగినట్టు టాక్. ‘

తనవైపు నుంచి 15 కోట్ల దాకా నష్టాన్ని భర్తీ చేసేందుకు రాధాకృష్ణ హామీ ఇస్తే బ్యానర్ తో అసోసియేట్ అయిన దర్శకుడు త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ నుంచి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టు వార్త. ఈ లెక్కన మొత్తం 20 కోట్ల దాకా వెనక్కు ఇచ్చేలా జరిగిన ఒప్పందం పూర్తి నష్టాలను పూడ్చలేనప్పటికీ తమ సంస్థ మీద నమ్మకాన్ని నిలబెడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. పైగా ఇదే బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ - విక్టరీ వెంకటేష్ సినిమాలు రాబోతున్నాయి కాబట్టి అవి బిజినెస్ చేసే టైంలో కొంత వెసులుబాటు కలిగించే విధంగా హామీ ఇవ్వడంతో ఇది మొత్తానికి సద్దుమణిగింది అనే టాక్ బలంగా నడుస్తోంది.పవన్ మాత్రం తాను ప్రొడక్షన్ పార్టనర్ కాదు కాబట్టి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినట్టు తెలిసింది.

ఈ వ్యవహారాలు మీడియాకు తెలిసేలా జరిగవు కాబట్టి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిజమనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అజ్ఞాతవాసి ప్రభావం రానున్న భారీ బడ్జెట్ సినిమాలపై పడేలా ఉంది. కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉన్నా ఆచితూచి పెట్టుబడులు పెట్టె విషయంగా డిస్ట్రిబ్యూటర్లు కాస్తంత గట్టిగానే నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది.
Tags:    

Similar News