స్టార్‌ హీరోలు తప్ప మిగిలిన హీరోలు త్రివిక్రమ్‌ కు అవసరం లేదా.?

Update: 2018-12-29 06:03 GMT
సెలబ్రిటీ సిండ్రోమ్‌ లా మాటల మాంత్రికుడు - కొంతమందికి హీరోలకు ఆస్థాన గురూజీ అయిన త్రివిక్రమ్‌ కు కూడా ఒక సిండ్రోమ్‌ ఉంది. అదే స్టార్‌ సిండ్రోమ్‌. ఈ సిండ్రోమ్‌ ఏంటే.. ఓన్లీ స్టార్స్‌ ని దృష్టిలో పెట్టుకునే కథలు రాయడం - వారితోనే సినిమా తీయడం. స్టార్స్‌ తో సినిమా వస్తుందంటే.. వేరే హీరోల్ని కూడా వదిలేయడం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ అలాంటి పొజిషన్‌లో ఉన్నాడు. ఫ్లాపులిచ్చినా - హిట్స్‌ కొట్టినా స్టార్స్‌ తోనే ఉండాలి.. లేదంటే.. మనం స్టార్‌ లేకుండా పోతాం అనే సూత్రాన్ని గురూజి బాగా వంటబట్టించుకున్నట్లు కన్పిస్తోంది.

 అసలు మ్యాటర్‌ లోకి వెళ్తే.. లాస్ట్‌ ఇయర్‌ డిసెంబర్‌ లో విక్టరీ వెంకటేశ్ పుట్టిన రోజు అన్ని పేపరల్లో యాడ్స్‌ వచ్చాయి. వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో సినిమా రాబోతుంది… త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ అని. కట్‌ చేస్తే.. ఏడాది దాటిపోయింది. సినిమా ప్రస్తావన కూడా లేదు. ఇప్పుడు తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌ తో చేయబోతున్నాడు త్రివిక్రమ్‌. వీవీఆర్‌ ఆడియో ఫంక్షన్‌ లో మెగాస్టారే ఈ విషయం స్వయంగా చెప్పాడు. అంటే.. కెరీర్‌ స్టార్టింగ్‌ లో తన డైలాగ్స్‌ కి ప్రాణం పోసిన వెంకటేశ్‌ కు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ హ్యాండ్‌ ఇచ్చేశాడన్నమాట. చూస్తుంటే.. త్రివిక్రమ్‌ కు స్టార్‌ హీరోలు తప్ప మిగిలిన వాళ్లు అసలు హీరోల్లా కన్పించడం లేదేమో.
   
Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News