మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` రికార్డులు మోత మోగిస్తోంది. ఈ మూవీ తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఏ తొలి చిత్ర కథానాయకుడి రికార్డుతో పోల్చినా ఉప్పెన నంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశంలోనే ఇప్పటికే అత్యధిక వసూళ్లు చేసింది.
బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ తొలి చిత్రం `కహో నా ప్యార్ హై` ఆ రోజుల్లో 80 కోట్ల రూపాయల వసూలు చేసింది. ట్రేడ్ సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` ఇదే ఫీట్ రిపీట్ చేయనుంది. ఇప్పటికి ఈ చిత్రం థియేటర్ల నుండి మొదటి వారం చివరి నాటికి 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కలెక్షన్లు ఇంకా బాగున్నాయి. ఈ చిత్రానికి రూ .100 కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అంటే.. కహో నా ప్యార్ హై రికార్డును బ్రేక్ చేసినట్టే అని భావించాలి. 2000 సంవత్సరంలో కహోనా ప్యార్ హై రికార్డ్ నెలకొల్పింది. అప్పుడు 80 కోట్ల రూపాయలు అంటే అది 2021 నాటికి సుమారు 200కోట్ల పైమాటే అన్న లెక్క వేయాలి. కానీ వైష్ణవ్ రికార్డ్ ఈ క్రైసిస్ వేళ చాలా గొప్పది అని చెప్పాలి.
సంక్రాంతి సీజన్ తర్వాత మళ్లీ ఉప్పెన మంచి ఊపు తెచ్చింది. డల్ సీజన్ అనుకున్నా ఒక ఊపు ఊపింది. సినిమా థియేటర్లలో నిబంధనలు ఎత్తివేయడంతో జనం థియేటర్లకు పోటెత్తారు. కరోనా భయాలు వదిలి హాయిగా సినిమాలు చూస్తున్నారని ప్రూవైంది.