మన చేసే ప్రతి పనీ సక్సెస్ అయితే బాగుటుందని.. పట్టిందల్లా బంగారం అయితే బాగుంటుందని చాలామంది కోరుకుంటారు గానీ అదేమంత సులువు కాదు. అందుకే సక్సెస్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా అని ఫెయిల్యూర్ గురించి అసలు మాట్లాడుకోకపోతే ఎలా? రీసెంట్ గా భారీ హంగామాతో ఒక బుల్లితెరలో ఒక షో ప్రారభించారు. నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ అన్న బిల్డప్ ఇచ్చారు. కానీ.. షో తుస్సుమంది. ఇప్పుడు తట్టా బుట్టా సర్డుతున్నారట.
ఇద్దరు పాపులర్ యాంకర్లు కలిసి ఈ షో చేస్తున్నారు. ఒకలాంటి రియాలిటీ షో అనుకోండి. ఇద్దరికీ బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఫిమేల్ యాంకర్లలో ఆమె నెంబర్ వన్ అయితే.. మేల్ యాంకర్లలో అయన నెంబర్ వన్ అన్నట్టు. ఇక చెప్పేదేముంది.. షో నిర్వాహకులు భారీమొత్తాన్నే ఈ షోపై ఖర్చు పెట్టారట. కానీ ఈ షో మొదలుపెట్టిన రోజునుండే.. 'ఒకలా'.. 'అదోలా' ఉందని జనాలు సణిగారు.. ఆతర్వాత రోజులు గడిచేకొద్దీ వల్గారిటీ ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో వల్గర్ భాషలో షోను..నిర్వాహకులను తిట్టడం మొదలు పెట్టారు. షో ను ఎలాగైనా సక్సెస్ చేయాలని నిర్వాహకులు సెలెబ్రిటీ గెస్టులను తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు.
విసుగుపుట్టిన బుల్లి తెర ప్రేక్షకులు ఈ షోను ఆపేయండి బాబోయ్ చూడలేక ఛస్తున్నామని నిర్వాహకులకు... ఇద్దరు యాంకర్లకు సందేశాలు పంపుతున్నారట. దీంతో నిర్వాహకులు ఓ వారం లో ఈ షో ను ముగించాలని నిర్ణయం తీసుకున్నారట. టీఆర్పీ పెరగడం సంగతి దేవుడెరుగు.. నిర్వాహకులకు కోట్లలో నష్టం వాటిల్లిందట.