డ‌ర్టీ పిక్చ‌ర్ హీరోపై మాజీ హీరోయిన్ ఫైర్‌

Update: 2016-07-24 13:17 GMT
బాలీవుడ్‌ లో నిన్న‌టి త‌రం హీరోల‌లో దిగ్గజ న‌టుడు రాజేశ్ ఖ‌న్నా ఒక‌రు. ఆయ‌న త‌న స‌మ‌కాలీన న‌టుల్లో దేశ‌వ్యాప్తంగా మంచి న‌టుల్లో ఒక‌రిగా పేరొందారు. 1942లో పంజాబ్‌ లోని అమృత్‌ స‌ర్‌ లో జ‌న్మించిన ఆయ‌న 1970-80 ద‌శ‌కంలో బాలీవుడ్‌ ను యేలారు. ఆయ‌న న‌ట‌నంటే అప్పుడు దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది యువ‌కులు - మ‌హిళ‌లు ప‌డి చ‌చ్చేవారు. మంచి టైమింగ్‌ తో న‌టిస్తార‌న్న పేరు కూడా ఆయ‌న‌కు ఉండేది. ఆరాధన (1969) - హాథీ మేరే సాథీ (1971) - ఆనంద్ (1971) - అమ‌ర్‌ ప్రేమ్ లాంటి సినిమాల‌తో ఆయ‌న ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర పుట‌ల‌ను ఏర్ప‌రుచుకున్నాడు.

  1973లో బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియాను వివాహం చేసుకున్న రాజేష్ త‌ర్వాత ఆమెతో విడిపోయాడు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక‌రైన ఆయ‌న గురించి బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు - ద డ‌ర్టీ పిక్చ‌ర్ హీరో న‌సీరుద్దిన్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజేష్ ఖ‌న్నాకు అస‌లు న‌ట‌నే రాద‌న్న‌ట్టుగా న‌సీరుద్దిన్ వ్యాఖ్య‌లు ఉన్నాయి. రాజేష్ ఖ‌న్నా నాసిర‌కం న‌టుడు అని - ఆయ‌న యాక్టింగ్ కూడా పెద్ద గొప్ప‌గా ఉండ‌ద‌ని న‌సీర్ బాంబు పేల్చారు.

 ఇక రాజేష్ ఖ‌న్నాకు స‌రైన అభిరుచి కూడా లేద‌ని...ఆయ‌న వ‌ల్లే 1970-80 ద‌శ‌కంలో బాలీవుడ్‌ లో చాలా స‌గ‌టు సినిమాలు వ‌చ్చాయ‌ని షా చెప్పుకొచ్చాడు. అయితే షా వ్యాఖ్య‌ల‌పై రాజేష్ ఖ‌న్నా కూతురు, అక్ష‌య్‌కుమార్ వైఫ్‌, మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నా(తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ శీను హీరోయిన్‌) తీవ్రంగా స్పందించారు. త‌న తండ్రిపై షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె తీవ్రంగా ఖండించింది. షా మీరు జీవించి ఉన్న‌వారిని గౌర‌వించ‌క‌పోయినా ప‌ర్వాలేదు.... చ‌నిపోయి, ఈ లోకంలో లేని వారిని మాత్రం గౌర‌వించండి....మీ వ్యాఖ్య‌ల‌కు బ‌దులు ఇవ్వ‌లేని వ్య‌క్తుల‌పై విమ‌ర్శ‌లు చేసే సంకుచిత‌త్వాన్ని వీడ‌నాడాల‌ని ఆమె సోష‌ల్ మీడియాలో షాకు స్ర్టాంగ్ రిప్లే ఇచ్చింది.
Tags:    

Similar News