ఎన్ బి కె వ‌ర్సెస్ సీబీఎన్ అన్ సెన్సార్డ్!

Update: 2022-10-27 15:00 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ‌ తొలిసారి హోస్ట్‌గా మారి `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` అంటూ టాక్ షోతో ఆశ్య‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. త‌న‌దైన స్టైల్లో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన సీక్రెట్ ల‌ని బ‌య‌టికి లాగుతూ ఈ షోని బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని చేసి అంతా అవాక్క‌య్యేలా చేశారు.   మొద‌టి సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో సీజ‌న్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అక్టోబ‌ర్ 14న సీజ‌న్ 2 ఊమించ‌ని గెస్ట్ ల‌తో మొద‌లైంది.

అక్టోబ‌ర్ 14 మంగ‌ళ‌వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ కు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ హాజ‌ర‌య్యారు. ప్రోమోతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ వీక్ష‌కుల్ని, నంద‌మూరి, నారా అభిమానుల్ని, టీడీపీ శ్రేణుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది. ఇక ఫ‌స్ట్ ఎపిసోడ్ లో నారా చంద్ర బాబు నాయుడు .. ఎన్టీఆర్ ని గ‌ద్దె దించ‌డం.. ల‌క్ష్మీ పార్వ‌తి కార‌ణంగా టీడీపీని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం వంటి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని నారా చంద్రబాబుని బాల‌య్య అడ‌గ‌డం.. వంటి విష‌యాలు ఆక‌ట్టుకున్నాయి.

బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు దానికి చంద్ర బాబు నాయుడు అంతే సెన్సిటీవ్ గా స‌మాధానం చెప్ప‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది. ఇక వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డితో స్నేహం.. గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావించ‌డం ఆక‌ట్టుకుంది. ఇదే షోకి బాబు త‌న‌యుడు నారా లోకేష్ కూడా రావ‌డంతో బాల‌య్య తండ్రీ కోడుకుల‌తో హంగామా చేశాడు.

ఇదిలా వుంటే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన అన్ క‌ట్ వెర్ష‌న్ కూడా వుంద‌ని ఇందులో మోర్ ఫ‌న్ అండ్ మోర్ సీక్రెట్స్ ని అన్ సెన్సార్డ్ అండ్ ఎక్స్ టెండెడ్ వెర్ష‌న్ ని గురువారం రాత్రి 12 గంట‌ల‌కు స్ట్రీమింగ్ చేయ‌బోతున్నాం` అంటూ ఆహా వారు ప్ర‌క‌టించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో `83లో మీరు అగైనెస్ట్ గా కంటెస్ట్ చేసి ఓడిపోయారు క‌దా? అని అడిగితేనారా చంద్ర‌బాబు నాయుడు మౌనం వ‌హించ‌డం..ఆ త‌రువాత ఓడిపోయాన‌ని చెప్ప‌డం..

ఇదే సంద‌ర్భంగా బాల‌య్య త‌న ఇంట‌ర్న‌ల్ అస్సెస్ మెంట్ ఎగ్జామ్ నుంచి ఎలా త‌ప్పించుకున్నాడో సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన తీరు ఆక‌ట్టుకుంటోంది. వీటితో పాటు చాలా చాలా ర‌హ‌స్యాల‌ని, మ‌రెన్నె కుట్ర‌ల‌ని, కుతంత్రాల‌ని బ‌హిర్గ‌తం చేయ‌బోతున్నార‌ట‌. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 12 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ సీక్రెట్ లేంటో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News