'2018' తెలుగులో లెక్క భలే సరిపోయింది

Update: 2023-06-03 16:00 GMT
మలయాళంలో సూపర్‌ హిట్ అయిన '2018' చిత్రంను తెలుగు లో బన్నీ వాసు డబ్ చేసి విడుదల చేశాడు. పెద్దగా ప్రచారం చేయకున్నా కూడా మొదటి రోజు కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. వీకెండ్‌ తో పాటు వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

మలయాళంలో తక్కువ సమయంలో వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా తెలుగు లో మొదటి 8 రోజుల్లో 8.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. రోజుకు కోటి చొప్పున రాబట్టిన ఈ సినిమా మరో రెండు కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.10 కోట్ల క్లబ్‌ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మలయాళంలో విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకు విడుదల అయ్యి.. పెద్దగా ప్రమోషన్‌ చేయకుండా మొదటి 8 రోజుల్లో రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈ మధ్య కాలంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాగా నిలిచింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. 2018 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల సందర్భంగా అప్పటి పరిస్థితులు మరియు జనాల యొక్క మనోభావాల గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. టోవినో థామస్‌.. ఇంద్రన్స్‌.. కుంచాకో బోబన్‌.. అపర్ణ బాలమురళి.. వినీత్ శ్రీనివాసన్‌ లు కీలక పాత్రల్లో కనిపించారు.

Similar News