జబ్బలు చరిచి...తొడలు కొట్టే సీమ కథలు ఎలాంటి సక్సెస్ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ నటసింహ బాలకృష్ణ తొడ కొట్టాడంటే? థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఆ విషయంలో బాలయ్య ని కాపీ కొట్టిన హీరోలెంతో మంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం గల సినిమాల్లో తొడగొట్టే సన్నివేశాలు చాలా సహజంగా కనిపించేవి.
వాటికి పురుడు పోసింది బాలయ్య మాత్రమే అని చెప్పాలి. ఆ తర్వాత చిరంజీవి..వెంకటేష్..నాగార్జన లాంటి హీరోలు అంతటి సాహసానికి పూనుకున్నారు. కానీ బాలయ్య రేంజ్ లో సక్సెస్ అయింది లేదు. ఇక నేటి జనరేషన్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...సూపర్ స్టార్ మహేష్ సైతం వివిధ సినిమాల్లో సన్నివేశం డిమాండ్ మేరకు తొడ గొట్టిన సందర్భాలున్నాయి.
వీళ్లలో అంతగా ఫేమస్ అయింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. సీమ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'ఆది'లో తొడగొట్టే ఎన్టీఆర్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత అంతటి లెగస్సీని మరో హీరో అందుకోలేదు. అలా తొడ కొట్టడం అన్నది నందమూరి వంశానికి మాత్ర మే చెల్లిందని చెప్పకనే చెప్పారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 'హరి హర వీరమల్లు' సినిమాలో తొడగొట్టిన సంగతి తెలిసిందే. టీజర్ లో పవన్ ఓ యాక్షన్ సన్నివేశంలో తొడగొట్టి పహిల్వాన్ లా రంగంలోకి దిగాడు. ముగ్గురు నలుగురు ప్రత్యర్ధి పహిల్వాన్లను వీరమల్లు మట్టికరిపించి మరి తొడగొట్టిన సన్నివేశం హైలైట్ గా నిలిచింది. పవన్ లో రౌద్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
పవన్ ఇంత సీరియస్ గా తొడ కొట్టడం కూడా ఇదే తొలిసారి. గతంలో కొన్ని సరదా సన్నివేశాల్లో కొట్టాడు తప్ప ఓ యాక్షన్ సీన్ కోసం కొట్టడం మాత్రం ఇదే మొదటి సారి. వాస్తవానికి ఇలా తొడగొట్టడం పవన్ కి ముందుగా నచ్చలేదుట. దర్శకుడు క్రిష్ మాట కాదనలేక ఆ సీన్ లో నటించాల్సి వచ్చిందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. పైగా సోషియా ఫాంటసీ నేపథ్యం కాబట్టి కొట్టినా అతి ఉండదు అన్న కోణంలోనూ పవన్ కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది.
కారణాలేవైనా పవర్ స్టార్ కూడా తొడగొట్టి మీసం మెలేయడం మాత్రం వీరమల్లులో ఇప్పటివరకూ ఉన్న హైలైట్ గా చెప్పొచ్చు. మరి ఇలాంటి సన్నివేశాలు సినిమా ఇంకెన్ని ఉన్నాయో. అన్నట్లు బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్రశాతకర్ణిలో కూడా క్రిష్ తో తొడ కొట్టించిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.