మిలియన్‌ మార్క్‌ క్రాస్ చేసిన 'హిట్ 2'

Update: 2022-12-12 06:31 GMT
యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ హీరో అడివి శేష్‌ మరో సూపర్ హిట్ ను హిట్ 2 తో తన ఖాతాలో వేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్ కు పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ను నమోదు చేసింది.

కరోనా తర్వాత యూఎస్ తో ఇండియన్ సినిమాలు మిలియన్ డాలర్లను సాధించడం చాలా పెద్ద విషయం అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో సునాయాసంగా వరుసగా తన సినిమాలతో మిలియన్ డాలర్ల మార్క్‌ ను క్రాస్ అవ్వడం కేవలం అడవి శేష్‌ కు మాత్రమే సాధ్యం అయ్యింది.

నాని నిర్మాణంలో వచ్చిన హిట్‌ సినిమా మంచి విజయం సాధించడం తో వెంటనే హిట్ 2 ను మొదలు పెట్టారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన హిట్ 2 ఇటీవల విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అడివి శేష్‌ గత చిత్రం మేజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా సాలిడ్ సక్సెస్ దక్కించుకుంది.

యూఎస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేయడంతో అక్కడ మరోసారి తన పట్టును శేష్ నిరూపించుకున్నాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలను శేష్ చేస్తాడు అనే అభిప్రాయం యూఎస్ ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఈ సినిమా తప్పకుండా బాగుంటుందని అంతా భావించారు. వారి అంచనాలకు తగ్గట్లుగా హిట్‌ 2 ఉండటంతో మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News