కోనసీమలో వంశీ డిజైనింగ్ మొదలైంది

Update: 2016-12-27 15:30 GMT

దర్శకుడు పసలపూడి వంశీ అంటే.. ఒకప్పుడు అదిరిపోయే సినిమాలంటూ జనాలు ఊగిపోయేవారు. లేడీస్ టైలర్ నుండి డిటెక్టివ్ నారద వరకు.. సితార నుండి ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వరకు.. ఆయన స్టయిలే వేరు. కాని ఇప్పుడు మాత్రం అనుకున్నట్లు పనులు జరగట్లేదు.. ఆయన తీసిన సినిమాలు అస్సలు ఆడట్లేదు. ఈ క్రమంలో ఆయన లేడీస్ టైలర్ సీక్వెల్ తీస్తున్నారంటే మాత్రం ఆసక్తిరేగింది. ''ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్‌ లేడీస్ టైలర్'' అంటూ ఆయన దూసుకుపోతున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు దగ్గర్లో ఈరోజు నుండి టాకీ పార్ట్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత వంశీ మరోసారి ఇదే ప్రాంతంలో షూటింగ్ మొదలు పెట్టడంతో.. ఇక అక్కడ హడావుడి అంతా ఇంతా కాదులే. అయితే ఇప్పటికే పాటల షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందట. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన అనీషా ఆంబ్రోస్.. మానస.. అలాగే మనాలి రాథోడ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో వంశీ సినిమాలు తీయడం కొత్త కాదు కాని.. ఈ సినిమాలో మాత్రం ఆయన మరోసారి ఫ్రెష్‌ స్ర్కీన్ ప్లే అండ్ విజువల్స్ తో అదరగొడుతున్నారట.

ఈ సినిమాను మధుర శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ కంపోజ్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ పాటలు.. చాలారోజులు నుండి ఫేడవుట్ అయిన ఈ సంగీత దర్శకుడికి కూడా పెద్ద బ్రేకే ఇస్తాయని అంటున్నారు. మరి కోనసీమలో వంశీ డిజైనింగ్ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News