ఇది బిగ్‌ బాస్ షోనా... హ‌నీమూన్ ట్రిప్పా..!

Update: 2019-09-05 07:09 GMT
బిగ్‌ బాస్ హౌస్‌ లో భార్య‌భ‌ర్త‌లుగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్‌ సందేశ్ - వితికా షెరు వ్య‌వ‌హారం చాలా విచిత్రంగా ఉంటుంది. హౌస్‌లో ప్ర‌తి చిన్న విష‌యానికి వితిక కావాల‌నో లేదా వ‌రుణ్‌ను బెదిరించుకునేందుకో ఎమోష‌న‌ల్ అయిపోతుంటుంది. ఏడ్చేస్తుంటుంది. ఆ వెంట‌నే వ‌రుణ్ వెళ్లి ఆమెకు సారీ చెప్ప‌డం.. బ‌తిమిలాడ‌డం హౌస్‌ లో కామ‌న్ అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిసారి అదే జ‌రుగుతూ వ‌స్తోంది. తాజాగా వితిక వ‌రుణ్‌ పై త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని... త‌న‌తో అస్స‌లు స‌మ‌యం గ‌డ‌ప‌డం లేద‌ని ఫైర్ అయ్యింది.

అయితే వ‌రుణ్ వితిక మాట‌ల‌పై కాస్త సీరియ‌స్ అయ్యాడు. హౌస్‌ లో 24 గంట‌లు క‌లిసే ఉంటున్నాం అని... మ‌నం బిగ్‌ బాస్ హౌస్‌ కు వ‌చ్చింది గేమ్ ఆడ‌డానికే గాని... హ‌నీమూన్‌ కు కాద‌ని ఘాటుగా రిప్లే ఇచ్చాడు. వ‌రుణ్ ఇచ్చిన రిప్లేతో వితిక ఒక్క‌సారిగా క‌న్నీళ్లు పెట్టుకుంది. తాను కొన్ని విష‌యాలు త‌న‌తో పంచుకోమ‌ని మాత్ర‌మే చెపుతున్నాన‌ని.. అంత‌క‌న్నా ఎక్కువేం మాట్లాడ‌మ‌న‌డం లేద‌ని వాపోయింది.

ప్ర‌తి సారి వితిక చేసే బ్లాక్‌ మెయిలో లేదా బెదిరింపుల‌కో లొంగిపోయి వెంట‌నే ఆమె చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డంతో పాటు... సారీ చెప్పే వ‌రుణ్ ఈ సారి ఆమె తీరుతో విసిగిపోయి ఆమెను ప‌ట్టించుకోలేదు. గ‌త మూడు రోజులుగా నిన్ను గ‌మ‌నిస్తున్నాను.. నువ్వు మాట్లాడుతున్న విధానం త‌ప్పు అంటూ వ‌రుణ్ చెప్ప‌డంతో వితిక ఒక్క‌సారిగా గుక్క‌ప‌ట్టి ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఇక్క‌డితో బుధ‌వారం ఎపిసోడ్ ముగిసింది. ఇక గురువారం ఎపిసోడ్‌ లో ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


Tags:    

Similar News