ఛలో ఇండియా సరదా టాస్క్ లో విజేతలుగా నిలిచిన బాబా భాస్కర్ - వరుణ్ - రాహుల్ లకు బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ముగ్గురు సభ్యులు గట్టిగా పోరాడారు. అయితే ఈ టాస్క్ కంటే ముందు బాబా భాస్కర్ హౌస్ లో ఫుల్ కామెడీ చేశారు. ఈ విశేషాలని ఒక్కసారి చూస్తే. శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభం అవ్వడమే బాబా భాస్కర్ తనకు వచ్చి రాని తెలుగులో పంచ్ లు వేస్తూ...ఇంటి సభ్యులని ఆటపట్టించారు.
తాను ఒకవేళ కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో పరిస్తితి ఇంటి సభ్యులకు బాబా భాస్కర్ సరదాగా వివరించే ప్రయత్నం చేశారు. తాను కెప్టెన్ అయితే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పెడతా అన్నారు. ఇలా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడలు కనిపించేలా తిరిగితే కుదరదని పునర్నవికి పంచ్ ఇచ్చారు. నీతో పాటు ఎవరూ పొట్టి బట్టలు వేసుకోకూడదన్నారు. అలాగే ఆడవాళ్ళంతా పొద్దునే లేచి మగవాళ్ళని లేపి కాఫీ ఇవ్వాలని - బయట ముగ్గు వేయాలని అన్నారు. అలాగే అలీ కూడా షర్ట్ విప్పి తిరిగితే కుదరదని బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు బట్టలు వేసుకునే రావాలన్నారు.
ఇలా హౌస్ లో సరదా సంఘటనలు జరుగుతుండగానే బిగ్ బాస్ బాబా భాస్కర్ - వరుణ్ - రాహుల్ లకు కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. దాని పేరు ‘మట్టిలో ఉక్కు మనిషి’ అని పెట్టారు. టాస్క్ ప్రకారం..ముగ్గురికి మూడు రంగుల బాల్స్ ఇచ్చి వాటిని మట్టిలో నుండి వెతికి పట్టుకుని బాస్కెట్ లో వేయాలన్నారు. ఇలా మట్టిలో బాల్స్ వెతికే ప్రక్రియలో ఒకర్నొకరు అడ్డుకోవాలని చెప్పారు. చివరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటే వారే విజేత అని చెప్పారు. దీంతో ముగ్గురు మట్టిలో దిగి అద్భుతంగా పోరాడారు. అయితే వరుణ్ 27 బాల్స్ వేసి రెండోసారి కెప్టెన్ అయ్యారు. ఇక రాహుల్ 15 - బాబా భాస్కర్ 13 బాల్స్ వేశారు.