తనవైపు వచ్చే కథల్లో కొత్తగా ఉండే వాటికి ఓకే చెబుతానని, ప్రయోగాల కంటే కొత్తదనం తనకు ఇష్టమని స్పష్టంగా చెప్పాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద, కంచె, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2 .. ఇలా అన్నీ కొత్తదనం నిండిన కథల్ని ఎంకరేజ్ చేశాడు. అందుకే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంపికల్లో కొత్తదనం, ప్రయోగాత్మకత అతడిని స్పెషల్ హీరోగా నిలబెట్టాయి. ఆ క్రమంలోనే అతడు తాను నటించబోయే కొత్త సినిమా టైటిల్ `వాల్మీకి` అని ప్రకటించగానే అందరిలో ఒకటే ఉత్కంఠ. ఈసారి ఇంకేం ప్రయోగం చేయబోతున్నాడు? అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. అనుకున్నంత పనీ చేస్తున్నాడా ఈ యంగ్ ప్రిన్స్? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. `14 రీల్స్ ప్లస్` పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రమిది. ఎఫ్ 2 లాంటి గ్రాండ్ విక్టరీ అందుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. `వాల్మీకి` పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల క్లాప్ నివ్వగా - రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు సుకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని టీమ్ తెలిపింది.
అయితే ఈ సినిమా తమిళ చిత్రం `జిగర్తాండ`కు రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అసలు ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? అంటే .. టైటిల్ కి తగ్గట్టే హీరో ఒక దొంగ. అంటే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించబోతున్నాడు. ఒక దొంగలో మార్పు (వాల్మీకి లో పరివర్తన తరహా) ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందేనట. జిగర్తాండ తమిళ వెర్షన్ లో సిద్ధార్థ హీరోగా నటించగా `పిజ్జా` ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం - ఆయనంకా బోస్ సినిమాటోగ్రఫీ ప్లస్ కానున్నాయి.