దిల్ రాజు అప్పటికి డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ఆయన బేనర్ లో కొత్త దర్శకుడు సినిమా చేశాడంటే సూపర్ హిట్టే అని జనాల్లో గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. పైగా అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా అది. సొంత నిర్మాణ సంస్థ ఉండగా నాగార్జున తన కొడుకుని రాజు చేతికి అప్పగించాడంటే ఇదేదో స్పెషల్ మూవీనే అయ్యుంటుందనుకున్నారంతా. దీంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘జోష్’ మాంచి హైప్ మధ్య రిలీజైంది. కానీ చివరికి రిజల్ట్ తేడా కొట్టేసింది. సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. దిల్ రాజుకు అదే తొలి ఫ్లాప్. ఆయన జడ్జిమెంట్ మీద తొలిసారి జనాలకు సందేహాలు కలిగింది అప్పుడే.
ఐతే జోష్ సినిమా మొదలుపెట్టేటపుడు ఎంత కాన్ఫిడెంటుగా ఉన్నాడో ఏమో కానీ.. సినిమా పూర్తయ్యాక మాత్రం రాజుకు దాని మీద అంత కాన్ఫిడెన్స్ ఏమీ లేదని డైరెక్టర్ వాసు వర్మనే స్వయంగా వెల్లడించాడు. తన రెండో సినిమా ‘కృష్ణాష్టమి’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అతను మాట్లాడుతూ.. ‘జోష్’ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ‘‘జోష్ సినిమా పూర్తయ్యాక ప్రివ్యూ వేసి చూశాం. రాజు గారు ‘ఏవరేజ్’ అని కొంచెం డల్లుగా చెప్పేసి వెళ్లిపోయారు. రిజల్ట్ దానికి తగ్గట్లే వచ్చింది. ఐతే ‘కృష్ణాష్టమి’ చూశాక మాత్రం విజయ సంకేతం చూపించారు. వచ్చి హగ్ చేసుకున్నారు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పదు. ఈ సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ’’ అన్నాడు వాసు.