విద్యాబాలన్ కు డెంగ్యూ సోకడమేంటి.. షాహిద్ కపూర్ కు ఫైన్ పడటమేంటి.. రెంటికీ ఏం సంబంధం.. అంతా గందరగోళంగా అనిపిస్తోంది కదా. ఇందులో తమాషా ఏమీ లేదు. అన్నీ నిజాలే. చిన్నా పెద్దా.. పేద ధనిక అని తేడా లేకుండా అందరినీ వణికిస్తున్న డెంగ్యూ వ్యాధి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను సైతం సోకింది. తీవ్రమైన జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. విద్యాబాలన్ డెంగీ బారిన పడ్డ విషయం వెల్లడైంది.
ముంబయి జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో విద్య విశ్రాంతి తీసుకుంటోంది. ఐతే విద్యాబాలన్ ఉండే ఆపార్ట్‌మెంట్లో డెంగీ దోమల నిరోధం విషయంలో ఉదాసీనంగా ఉన్నందుకు.. నిబంధనలు పాటించనందుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషణ్ కొరడా ఝులిపించింది. విద్యాబాలన్ ఉండే అపార్ట్‌మెంట్ లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మరో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఉంటున్నాడు.
షాహిద్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అందులో చాన్నాళ్లుగా నీళ్లను మార్చలేదు. దాని వల్ల డెంగీ దోమలు వృద్ధి చెందాయని అధికారులు గుర్తించారు. దీంతో అతడికి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు జరిమానా విధించారు. నెల రోజులుగా ముంబయిలో డెంగ్యూ వ్యాధి తీవ్రమవుతోంది. సెప్టెంబరు నెలలోనే 1500కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కొందరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స కూడా పొందుతున్నారు.